IPL 2026: RCB కొనుగోలు రేసులో బిలియనీర్ ? చరిత్ర చూడని రేటు..!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత బ్రాడింగ్ కలిగిన జట్లలో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ జట్టు తాజాగా ఎన్నాళ్లుగానో తమను ఊరిస్తున్న తొలి టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ జట్టు యజమానిగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ దీన్ని అమ్మేయాలని నిర్ణయించింది. దీంతో పోటీ మొదలైంది. ఇప్పుడు ఈ జట్టును కైవసం చేసుకునేందుకు కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీఈవో ముందువరుసలో ఉన్నారు.

కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను కొనుగోలు చేయడానికి రాబోయే కొన్ని నెలల్లో "బలమైన మరియు పోటీ" బిడ్ వేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్సీబీ యజమాని అయిన డయాజియో నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ .. ఈ ఫ్రాంచైజీని విక్రయించడానికి $2 బిలియన్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

IPL 2026 Will Adar Poonawalla Pay 2 Billion to Own RCB Bid Confirmed

ప్రస్తుతం ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయడానికి భారీగానే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ దీని రేటును 2 బిలియన్ డాలర్లకు పెంచేసినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం ఇది 18 వేల కోట్లకు పైమాటే. ఇప్పటివరకూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం పెట్టిన అతిపెద్ద పెట్టుబడి 7090 కోట్లు. దీన్ని లక్నో సూపర్ జెయింట్స్ కోసం గోయెంకా గ్రూప్ పెట్టింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలుకు 18 వేలకోట్లు పెడితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద బేరం ఇదే అవుతుంది. ఇది ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన సింగిల్-టీమ్ ఆస్తులలో ఒకటిగా మారుతుంది. ఈ అమ్మకాన్ని పర్యవేక్షించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీని లావాదేవీ సలహాదారుగా నియమించినట్లు నివేదికలు చెప్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+