SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - అనూహ్య నిర్ణయం..!!
పవాల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదలించింది. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను అందరూ ఖండిస్తున్నారు. ఘటన పైన కేంద్రం అప్రమత్తం అయింది. బాధితులకు అండగా నిలుస్తోంది. ఉగ్రవాదుల పైన కఠిన చర్యలకు సిద్దం అవుతోంది. ఈ ఘటన పైన క్రికెటర్లు స్పందించారు. బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ఈ రోజు జరగాల్సిన సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నేటి మ్యాచ్ లో
జమ్ము కాశ్మీర్ లోని పవాల్గాం లో ఉగ్రదాడిలో దాదాపు 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పో యారు. ఈ ఘటన పైన క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేసారు. ఘటనను ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి బీసీసీఐ నివాళి అర్పించనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్ రైజర్స్ - ముంబాయి మధ్య జరిగే మ్యాచ్ లో రెండు టీంల ఆటగాళ్లతో పాటుగా అంపైర్లు సైతం చేతులకు ఆర్మ్ బ్యాండ్స్ ధరించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మరణించిన వారికి సంతాపం తెలియ చేస్తూ ఒక్క నిమిషం మౌనం పాటించనున్నారు. ఈ రోజు మ్యాచ్ లో చీర్ గర్ల్స్ ఉండకూడదని నిర్ణయంచారు.













Click it and Unblock the Notifications