మళ్లీ ఐపీఎల్ లో ముస్తాఫిజుర్ ? బీసీసీఐ ఆఫర్ వార్తలపై బీసీబీ క్లారిటీ..!
బంగ్లాదేశ్ లో హిందువుల ఊచకోత ఘటనల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్ లో ఆడనివ్వకుండా బీసీసీఐ నిషేధం విధించింది. దీని ప్రకారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తప్పించారు. దీంతో భారత్ లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వేదికలను మార్చాలనే డిమాండ్ ను బంగ్లా బోర్డు తెరపైకి తెచ్చింది. అలాగే ఐపీఎల్ ప్రసారాన్ని తమ దేశంలో నిషేధిస్తూ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది.
బంగ్లాదేశ్ తో రాజకీయ వివాదం కాస్తా క్రికెట్ కు పాకడంతో పాటు ఐపీఎ ల్, టీ20 వరల్డ్ కప్ లపైనా పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ వెనక్కి తగ్గినట్లు వార్తలొచ్చాయి. రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదాలతో ఇప్పటివరకూ కలిసి ఉన్న రెండు క్రికెట్ బోర్డుల మధ్య కూడా గ్యాప్ పెరిగిపోతుండటంపై బీసీసీఐ స్పందించి ముస్తాఫిజుర్ ను తిరిగి ఐపీఎల్ లో అనుమతించేందుకు అంగీకరించిందనేది ఈ వార్తల సారాంశం.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఛీప్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ స్పందించారు. రెండు క్రికెట్ బోర్డుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026లో ఆడేందుకు బీసీసీఐ ప్రతిపాదించిందని వచ్చిన వార్తలపై స్పందించారు. ఐపీఎల్ కు ముస్తాఫిజ్ రిటర్న్ గురించి తాను బీసీసీఐతో ఎలాంటి రాతపూర్వక లేదా మౌఖిక చర్చలు జరపలేదని తెలిపారు. దీని గురించి తమ బోర్డు నుండి ఎవరితోనూ తాను మాట్లాడలేదన్నారు. ఈ వార్తలో నిజం లేదని ఫైనల్ గా తేల్చిచెప్పేసినట్లు అజ్కేర్ వార్తాపత్రిక పేర్కొంది.












Click it and Unblock the Notifications