T20 World cupలో అత్యంత తెలివైన జట్టు అదే..! తేల్చేసిన ఇర్ఫాన్ పఠాన్ ..!
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)లో అత్యంత తెలివైన జట్టు ఏది ?, ప్రస్తుతం గ్రూప్ దశ దాటి సూపర్ 8 మ్యాచ్ లు కొనసాగుతున్న దశలో ఇప్పటికే ఫైనల్ చేరిన ఇంగ్లండ్, వరుసగా గెలుస్తున్న దక్షిణాఫ్రికా, అండర్ హార్స్ జట్లుగా పేరు తెచ్చుకున్న న్యూజీలాండ్, వెస్టిండీస్ లా, ఇందులో ఏది అత్యంత తెలివైన జట్టు అన్న ప్రశ్నకు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan pathan) సమాధానం చెప్పాడు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు.
ఉపఖండపు జట్లు అయిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక ఇప్పటికే పరాజయాల బాటలో ఉన్నాయి. భారత్ తమ గత సూపర్ 8 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. పాకిస్తాన్ కూడా సూపర్ 8లో ఓ మ్యాచ్ రద్దు, మరో మ్యాచ్ ఓటమితో దాదాపు ఇంటిముఖం పట్టింది. శ్రీలంక అయితే అధికారికంగానే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఉపఖండపు పిచ్ లు, పరిస్ధితుల్ని అర్ధం చేసుకున్న ఏకైక జట్టు దక్షిణాఫ్రికానే అని ఇర్ఫాన్ పఠాన్ తేల్చిచెప్పేశాడు. ఇందుకు గల కారణాలూ వెల్లడించాడు.

No one has read conditions better than South Africa at this World Cup.
— Irfan Pathan (@IrfanPathan) February 26, 2026
Night game vs India, Batted first on black soil.
Afternoon game today,Won the toss and chose to chase on red soil,backing the bounce.
That is solid game awareness, and elite game IQ.
ఈ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా కంటే పరిస్థితులను ఎవరూ బాగా అర్థం చేసుకోలేదని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. భారత్‌తో జరిగిన రాత్రి ఆటలో నల్లటి పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసింది, ఇవాళ మధ్యాహ్నం ఆట (వెస్టిండీస్ తో) టాస్ గెలిచి ఎర్రటి పిచ్ పై ఛేజింగ్ చేసేందుకు సిద్దమైంది. అలాగే బౌన్స్ ను నమ్ముకుంది. అది ఆటపై ఆ జట్టుకు ఉన్న అత్యుత్తమ అవగాహన, ఎలైట్ గేమ్ ఏఐ అని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు. ఇప్పటికే సూపర్ 8లో భారత్ పై భారీ తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా, ఇవాళ విండీస్ పైనా గెలిస్తే సెమీస్ లోకి దూసుకెళ్లడం ఖాయమైన వేళ పఠాన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications