విన్నర్లు వర్సెస్ రన్నరప్ లా? వరల్డ్ కప్ సూపర్ 8 ఫార్మాట్ పై విమర్శలు..!
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026)ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ వివాదం, ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ వివాదం, ఇప్పుడు సూపర్ 8 ఫార్మాట్ వివాదం. ఈ టోర్నీలో సూపర్ 8 ఫార్మాట్ ను ఐసీసీ సెట్ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ 8లో జట్లకు ముందుగానే సీడింగ్ ఇచ్చేయడం, ఆ సీడింగ్ ఇచ్చిన జట్లలో కొన్ని అసలు సూపర్ 8కు రాకపోవడం, వచ్చిన జట్లలో పోటీ కూడా విచిత్రంగా ఉండటం ఇందుకు కారణమవుతోంది.
ఈ వరల్డ్ కప్ లో ఆడిన మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించిన ఐసీసీ (icc) ప్రతీ గ్రూపులోనూ టాప్ 1, 2 పొజిషన్లలో నిలిచిన వారిని సూపర్ 8కు అర్హులుగా చేసింది. దీంతో ప్రతీ గ్రూపులోనూ పోటీ పడి టాప్ లో నిలిచిన జట్లతో పాటు రెండో స్ధానంలో నిలిచిన జట్లు కూడా సూపర్ 8కు అర్హత సాధించాయి. కానీ సూపర్ 8లో ముందుగానే ఎనిమిది జట్లకు ప్రీ సీడింగ్ పేరుతో అనధికార అర్హత ప్రకటించిన ఐసీసీ విమర్శలు ఎదుర్కొంది. ఇలా ప్రీడింగ్ ప్రకటించిన జట్లలో ఆస్ట్రేలియా సూపర్ 8కు చేరలేదు, దీని స్ధానంలో జింబాబ్వే అర్హత సాధించింది. ఈ విమర్శల నుంచి బయటపడేలోగా ఐసీసీకి మరో విమర్శ ఎదురైంది.

సూపర్ 8 లోనూ రెండు గ్రూపులు పెట్టింది. ఈ రెండు గ్రూపుల్లో మొదటి గ్రూపులో ఉన్న వారిని చూస్తే వారంతా గ్రూప్ స్టేజ్ లో తమ గ్రూపుల్లో టాప్ లో నిలిచి వారు. అంటే విన్నర్లన్న మాట. అలాగే సూపర్ 8 రెండో గ్రూపులో ఉన్న వారిని చూస్తే వారంతా గ్రూప్ స్టేజ్ లో తమ గ్రూపుల్లో రెండో స్ధానంలో నిలిచిన వారే. అంటే రన్నరప్ లు అన్నమాట. దీన్ని బట్టి చూస్తే గ్రూప్ స్టేజ్ లో విన్నర్లకూ, రన్నరప్ లకూ మధ్య ఆటోమేటిగ్గా సూపర్ 8 పోరు జరగబోతోందన్న మాట. ఇదే ఐసీసీపై విమర్శలకు కారణమవుతోంది.

ప్రస్తుతం సూపర్ 8 తొలి గ్రూపుకు అర్హత సాధించిన జట్లలో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీరంతా గ్రూప్ స్డేజ్ లో టాప్ 1 పొజిషన్ లో నిలిచిన వారే. అలాగే సూపర్ 8 రెండో గ్రూప్ లో పాకిస్తాన్, శ్రీలంక, న్యూజీలాండ్, ఇంగ్లండ్ ఉన్నాయి. వీరంతా గ్రూప్ స్డేజ్ లో రెండో స్ధానంలో నిలిచిన వారే. ఇప్పుడు సూపర్ 8లో ఉన్న రెండు గ్రూపుల్లో ప్రతీ గ్రూపులో ప్రతీ జట్టూ మిగిలిన మూడు జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు మాత్రమే సెమీస్ కు అర్హత సాధిస్తారు. అంటే సూపర్ 8 స్టేజి లోనే గ్రూపు స్టేజిలో విన్నర్లుగా నిలిచిన ఇద్దరు ఇంటిముఖం పట్టడం ఖాయం. అలాగే ఆతిధ్య శ్రీలంక సెమీస్ కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ను తమ స్వదేశంలో కాకుండా భారత్ లో ఆడాల్సి రావడం కూడా విమర్శకు తావిస్తోంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications