Ind vs Zim: జింబాబ్వే మ్యాచ్ కు సూర్య, అక్షర్ ఇలా చేస్తే ? తేల్చేసిన ఇర్ఫాన్ పఠాన్..!
టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) సూపర్ 8లో భాగంగా ఎల్లుండి చెన్నైలో భారత్-జింబాబ్వే మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ ఏలో ఆడిన తొలి మ్యాచ్ లోనే భారీ విజయాలతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు సెమీస్ రేసుకు గట్టి పోటీదారులుగా నిలిచారు. ఈ నేపథ్యంలో భారత్ జింబాబ్వే, వెస్టిండీస్ తో జరిగే తదుపరి మ్యాచ్ లను కచ్చితంగా గెలవడంతో పాటు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్ రేట్ కలిసొచ్చి సూపర్ 8 నుంచి సెమీస్ బెర్త్ ఖరారుచేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో భారత జట్టులో పలు మార్పులు తప్పేలా లేవు. ఇప్పటికే ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ పై ఆందోళన నెలకొంది. అలాగే గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ ను కాదని వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ ఆర్డర్ లో తప్పనిసరిగా చేయాల్సిన మార్పుల్ని టీమిండియా మాజీ పేసర్, వరల్డ్ కప్ లో అనలిస్ట్ గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ (irfan pathan) సూచించాడు. ఈ మార్పులు చేస్తే ఫలితం ఉంటుందని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు పఠాన్ సూచించాడు.

చెన్నైలో జింబాబ్వేతో జరిగే డూ ఆర్ డై మ్యాచ్ కు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సెకండ్ డౌన్ లో కాకుండా వన్ డౌన్ లో రావాలని ఇర్ఫాన్ పఠాన్ సూచిస్తున్నాడు. ఎందుకంటే ఇద్దరు ఓపెనర్లతో పాటు వన్ డౌన్ లో వస్తున్న తిలక్ వర్మ కూడా లెఫ్ట్ హ్యాండర్సే కావడమే కారణం. దీని వల్ల ప్రత్యర్ది బౌలర్ల పని సులువవుతుందన్నాడు. అదే సూర్య వన్ డౌన్ లో వస్తే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టొచ్చని పఠాన్ సూచిస్తున్నాడు. ఇప్పటికే టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ కు వన్ డౌన్ లో వచ్చి 32 మ్యాచ్ ల్లో 158.33 సగటుతో 864 పరుగులు చేసిన చరిత్ర ఉంది. ఇందులో ఓ సెంచరీతో పాటు ఆరు అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి.

అలాగే వాషింగ్టన్ సుందర్ స్ధానంలో బ్యాటింగ్, బౌలింగ్ లో బెటర్ అయిన అక్షర్ పటేల్ ను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించాడు. అక్షర్ పటేల్ అనుభవం లెఫ్ట్ హ్యాండర్లపై పనికొస్తుందన్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ ను కూడా పరిశీలించాలని పఠాన్ సలహా ఇస్తున్నాడు. విండీస్ తో మ్యాచ్ కు ఈ మార్పు పనికొచ్చే అవకాశం ఉందంటున్నాడు.












Click it and Unblock the Notifications