ఇషాన్ కిషన్ అవుట్- వైభవ్ సూర్యవంశీకి సెకెండ్ ఛాన్స్.. !!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. 2-0 తేడాతో ముందంజలో ఉంది. సిరీస్ విజయంపై కన్నేసింది. మూడో మ్యాచ్ లో గెలిస్తే.. సిరీస్ భారత్ వశమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆరంభమౌతుందిది. ఇందులో గెలిచి గట్టి పోటీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉంది న్యూజిలాండ్. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య టీమిండియా అనుకోని షాక్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. గ్రోయిన్ స్ట్రెయిన్ గాయం కారణంగా ఇప్పటికే రెండో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోవట్లేదు. దీంతో మూడో మ్యాచ్ కు కూడా ఆయన అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో తుదిజట్టులో వైభవ్ సూర్యవంశీని తీసుకోవడం దాదాపుగా ఖాయమైనట్టే.

Ishan Kishan Ruled Out of India vs New Zealand 3rd T20I Vaibhav Sooryavanshi to get another chance

గాయాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్మెంట్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నప్పటికీ.. అతని ఫిట్‌నెస్‌పై ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తోన్నామని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు. జట్టులోని కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్, ఫిట్‌నెస్‌ను బ్యాలెన్స్ చేయడం మేనేజ్‌మెంట్ బాధ్యత అని పేర్కొన్నాడు. ఇషాన్ పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే తుదిజట్టులో తీసుకుంటామని వివరించాడు.

వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు
వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు

ఇషాన్ కిషన్ గాయం కారణంగా రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం లభించింది. ఓపెనర్‌గా తనదైన ముద్ర వేసిన అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం చర్చకు దారితీసింది. ఆ మ్యాచ్‌లో అతను విఫలం అయ్యాడు. నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతనికి అనుకూలంగా ఉండే ఓపెనింగ్ స్థానాన్ని కాదని, మూడో స్థానంలో ఆడించడం వల్లే క్రీజ్ లో కుదురుకోలేకపోయాడనే అభిప్రాయాలు ఉన్నాయి.

టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ
టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వైభవ్ జట్టులో ఉన్నప్పటికీ, రెగ్యులర్ ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పంపి, వైభవ్‌ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం విమర్శలకు తావిచ్చింది. సంజు శాంసన్‌కు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉన్నందున, అతడిని మూడో స్థానంలో పంపి వైభవ్‌కు ఓపెనింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదని మాజీలు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+