IPL మ్యాచ్‌లకు ఉచితంగా 3 టికెట్లు - కండీషన్స్ అప్లై..!!
IPL 2026: ఐపీఎల్ ప్రారంభమైంది. ఆరంభ మ్యాచుల్లోనే అనూహ్య ఫలితాలు.. కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ప్రధాన జట్ల పైన అంచనాలు మారుతున్నాయి. కొత్త ప్లేయర్లు సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ వేళ ప్రభుత్వ ప్రమేయం పైన చర్చ మొదలైంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లకు ఉచిత టికెట్ల పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. అందునా కొందరికే ఈ ఆఫర్ పరిమితం చేసారు. ఇప్పుడు ఇదే అంశం అటు పొలిటికల్ గా.. ఇటు ఐపీఎల్ అభిమానుల్లోనూ చర్చగా మారుతోంది.
ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు కర్ణాటక ఎమ్మెల్యేలకు మూడు టికెట్‌లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం.. క్రికెట్ సంఘంతో ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ, డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజిమెంట్ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఒక్కో ఎమ్మెల్యేకు ఐపీఎల్ మ్యాచ్‌లకు 3టికెట్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు 2 టికెట్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తాము వీఐపీలమని, క్యూలో నిలబడి ఐపీఎల్ టికెట్‌లు కొనుగోలు చేయలేమని శాసనసభలో ఎమ్మెల్యేలు గతవారం ప్రస్తావించారు. ఈ డిమాండ్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్ష నేత అశోక్ కూడా ఇదే డిమాండ్ చేయటంతో.. తాజాగా ఈ అంశం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఎమ్మెల్యేలకు ఉచితంగా మూడు టికెట్లు
దీని పైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక క్రికెట్ సంఘం భావిస్తున్న ట్లు చెప్పారు. కాగా.. తాజాగా జరిగిన చర్చల్లో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే లు అందరికీ స్టేడియంలోని 'P3' స్టాండ్‌లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీనివల్ల అందరూ ఒకే చోట కూర్చునే అవకాశం ఉంటుంది. గతంలో ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన ఘటనను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతున్నాయని డీకే గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు కూడా వ్యవస్థలో భాగమే కాబట్టి, వారికి తగిన ఏర్పాట్లు చేయడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా ఈ విషయంపై చర్చలు జరిపారు. దీంతో.. ఆర్సీబీ- సన్ రైజర్స్ మ్యాచ్ సమయంలోనే ఈ ప్రతిపాదన పైన చర్చలు జరిగాయి. తాజా నిర్ణయంతో.. ఇక నుంచి బెంగళూరులో జరిగే మ్యాచులకు వీరికి ఉచితంగా మూడు టికెట్లు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications