విరాట్-అనుష్కల తరహాలోనే కావ్య మారన్ పెళ్లి?

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సీఈవో కావ్య మారన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి వేడుక వార్తలు సోషల్ మీడియాలో, క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీరి పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు రోజుకో మలుపు తిరుగుతుండగా.. వివాహ రిసెప్షన్ తేదీ బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లి మాదిరిగానే వీరి పెళ్లి కూడా అత్యంత గోప్యంగా, రహస్య వేడుకగా జరగనుందా అనే కోణంలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

IND vs WI: మ్యాచ్‌కు వాన గండం: డిసైడర్ పోరులో టాస్ ఆలస్యం!
IND vs WI: మ్యాచ్‌కు వాన గండం: డిసైడర్ పోరులో టాస్ ఆలస్యం!

ఇటీవల సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కూతురు వివాహ రిసెప్షన్‌కు అధికారికంగా ఆహ్వానించారు. తెలంగాణ సీఎంవో తమ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. ఈ రిసెప్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనుంది. చెన్నై రిసెప్షన్‌కు దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లినప్పటికీ.. పెళ్లి ముహూర్తం, వేదికపై మాత్రం కళానిధి మారన్ కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Kavya Maran and Anirudh Ravichander Wedding Secret Destination Marriage Like Virat Kohli-Anushka Sharma

కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 10 లేదా 11వ తేదీల్లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగవచ్చని భావిస్తున్నారు. అయితే గ్రీస్‌లో ఏ ఐలాండ్ లేదా రిసార్ట్ అనే వివరాలను గోప్యంగా ఉంచడం వల్ల.. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ఇటలీలో చేసుకున్న ప్రైవేట్ వెడ్డింగ్ తరహాలోనే కావ్య-అనిరుధ్ రవిచందర్‌ల వివాహం కూడా ఓ రహస్య ఆపరేషన్‌లా సాగనుందని సమాచారం.

వెస్టిండీస్ సిరీస్‌లో నో ఛాన్స్.. మనసులోని మాటను బయటపెట్టిన బేబీ బాస్!
వెస్టిండీస్ సిరీస్‌లో నో ఛాన్స్.. మనసులోని మాటను బయటపెట్టిన బేబీ బాస్!

గత కొన్నేళ్లుగా అనిరుధ్, కావ్యల డేటింగ్ వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. గతంలో అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలను సరదాగా కొట్టిపారేశారు. కానీ రజినీకాంత్ జైలర్, జైలర్ 2 సినిమాల సమయం నుంచి కళానిధి మారన్ కుటుంబంతో అనిరుధ్ రవిచందర్‌కు ఉన్న అనుబంధం మరింత బలపడింది. కావ్య, అనిరుధ్ జోడీ స్వయంగా స్పందించేంత వరకు గ్రీక్ వివాహం, ప్రైవేట్ వేడుక వార్తలను ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉన్నప్పటికీ.. నవంబర్ 21 రిసెప్షన్ ఖరారు కావడంతో వీరి పెళ్లి వార్త నిజమేనని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+