లార్డ్స్ టెస్టులో సిరాజ్ అవుట్ పై బ్రిటన్ రాజు ఏమన్నారో తెలుసా ?
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతున్న భారత జట్టుకు నిన్న అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న గిల్ సేన.. రెండో టెస్టులో ఘన విజయం అందుకుంది. మూడో టెస్టులో కేవలం 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదులుకున్న తరుణంలో రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో విజయానికి దగ్గరగా వచ్చింది. అయితే అనూహ్యంగా టెయిలెండర్ సిరాజ్ బౌల్డ్ కావడంతో ఓటమి తప్పలేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ తో టీమిండియా భేటీ అయింది. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో భారత క్రికెటర్లతో సరదాగా మాట్లాడిన బ్రిటన్ రాజు.. వారితో ఫొటో సెషన్ లో కూడా పాల్గొన్నారు. అలాగే క్రికెటర్లతో వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు. లార్డ్ టెస్టులో టీమిండియా పోరాట స్ఫూర్తిని బ్రిటన్ రాజు ప్రశంసించారు. ఇదే క్రమంలో నిన్న జరిగిన లార్డ్ టెస్టులో లాస్ట్ వికెట్ గా వెనుదిరిగిన మొహమ్మద్ సిరాజ్ గురించి కూడా మాట్లాడారు. సిరాజ్ అవుట్ పై బ్రిటన్ రాజు స్పందించారు. సిరాజ్ అవుట్ దురదృష్టకరమని రాజు చెప్పినట్లు ఈ భేటీ అనంతరం కెప్టెన్ శుభ్ మన్ గిల్ తెలిపారు.

#WATCH | The United Kingdom: King Charles III pose with the players of the Indian Men's and Women's Cricket team, the coach, staff members and BCCI officials, at St. James's Palace in London. pic.twitter.com/YRhQPcXvuw
— ANI (@ANI) July 15, 2025
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆకర్షించిన లార్డ్స్ టెస్టులో హైలెట్స్ ను రాజు ఛార్లెస్ చూసినట్లు ఇంగ్లీష్ మీడియా తెలిపింది. అనంతరం టీమిండియా క్రికెటర్లను కలిసిన సందర్బంగా ఆయన టీమిండియా పోరాట స్ఫూర్తిని ప్రశంసించారు. అయితే లార్డ్ టెస్టులో ఓటమి పాలవ్వడం తమను నిరాశకు గురి చేసిందని కింగ్ ఛార్లెస్ తో చెప్పినట్లు శుభ్ మన్ గిల్ వెల్లడించాడు.
రాబోయే రెండు టెస్టుల్లో గెలిచేందుకు సర్వశక్తులొడ్డుతామని గిల్ తెలిపాడు. రాజును కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సిరాజ్ అవుట్ పై స్పందిస్తూ.. బంతి స్టంప్స్‌పైకి దూసుకెళ్లిందని, ఆ తర్వాత ఎలా అనిపించిందని రాజు అడిగినట్లు గిల్ తెలిపాడు. లార్డ్ మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ జట్లలో ఎవరివైపు అయినా మొగ్గే అవకాశం ఉందని కింగ్ ఛార్లెస్ కు గిల్ తెలిపాడు. కింగ్ చార్లెస్ తన సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకూ ఆతిధ్యం ఇచ్చారు.












Click it and Unblock the Notifications