14 ఏళ్లకే ఐపీఎల్ .. ఫస్ట్ బంతికే సిక్సర్.. వైభవ్ సూర్యవంశీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?
14 ఏళ్లకే ఐపీఎల్ .. ఫస్ట్ బాల్ కే సిక్సర్.. ఇదీ ఆ కుర్రాడి స్పెషల్. అవును ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే పేరు మారుమోగుతోంది. అతడే వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడిన ఫస్ట్ బంతికే సిక్సర్ బాది చరిత్ర సృష్టించాడు ఈ టీనేజ్ క్రికెటర్. అంతేకాదు అతి పిన్న వయసు (14 ఏళ్ల 23 రోజులు)లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నయా రికార్డు నెలకొల్పాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వైభవ్. అయితే తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ కుర్రాడు ఆడిన తొలి బంతికే సిక్సర్ కొట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో వైభవ్ మొత్తం 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. దీంతో అతడి ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

వైభవ్ ను క్రికెట్ దిగ్గజాల నుంచి సామాన్య క్రికెట్ ఫ్యాన్స్ వరకూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఆఖరికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైభవ్ ఆటను ఆకాశానికి ఎత్తారు. తాను ఈ 8 వ తరగతి స్టూడెంట్ ఆటను చూసేందుకు నిద్ర లేచానని సుందర్ పిచాయ్ అన్నారు. ఐపీఎల్ లో సూర్యవంశీ అద్భుతమైన అరంగేట్రం చేశాడని కొనియాడారు. అసలు వైభవ్ సూర్యవంశీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

బీహార్ లోని చిన్న గ్రామం..
బీహార్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన వైభవ్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అతడి తండ్రి ఒక సాధారణ విలేకరి. వైభవ్ కు క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ప్రోత్సహించాడు. అంతేకాక స్వయంగా గురువుగా మారి శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత వైభవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ రంజీ జట్టులో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో వైభవ్ కోసం రాజస్థాన్, దిల్లీ జట్లు పోటీపడ్డాయి.
Woke up to watch an 8th grader play in the IPL!!!! What a debut! https://t.co/KMR7TfnVmL
— Sundar Pichai (@sundarpichai) April 19, 2025
1.10 కోట్ల రికార్డు ధరకు రాజస్థాన్ రాయల్స్ అతడిని సొంతం చేసుకుంది. దీంతో అతిపిన్న వయసులో అత్యధిక ధరకు వేలంలోకి వచ్చిన ఆటగాడిగానూ వైభవ్ రికార్డు నెలకొల్పాడు. కేవలం 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన వైభవ్ దూకుడు ఆటతీరుతో అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. 14 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రదర్శన కనబరుస్తున్న వైభవ్ రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు ఒక గొప్ప ఆస్తిగా మారతాడని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications