సన్‌రైజర్స్ ఘోర పరాజయానికి మూడు కారణాలు

Mumbai Indians vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో తన పరాజయాల ప్రస్థానాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనసాగిస్తూనే వస్తోంది. ముంబై ఇండియన్స్‌పై మరో ఓటమిని చవి చూసింది. మున్ముందు కఠిన సవాళ్లను ఎదుర్కోనున్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరడానికి తలకిందులుగా తపస్సు చేయక తప్పని పరిస్థితిలో పడింది.

అన్నింట్లో విఫలం..

వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేక పోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ- 40, ట్రావిస్ హెడ్- 28 పరుగులతో తొలి వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులను అందించినప్పటికీ- దాన్ని భారీ స్కోర్‌గా మలచుకోలేకపోయింది.

MI vs SRH 3 reasons for Sunrisers Hyderabad lost its match to Mumbai Indians in IPL 2025

పరాజయానికి తొలి మెట్టు..

ఇషాన్ కిషన్ మరోసారి చేతులెత్తేశాడు. రెండు పరుగులకే పరిమితం అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి- 19, హెన్రిచ్ క్లాసెన్- 37, అనికేత్ వర్మ- 18, పాట్ కమ్మిన్స్- 8 పరుగులు చేశారు. బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ- భారీ ఇన్నింగ్, దానికి తగ్గ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలం అయ్యారు. పరాజయానికి అదే తొలి మెట్టు అయింది.

బౌలర్ల తడాఖా..

ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బంతులు సంధించారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 59 పరుగులు జమ అయినప్పటికీ దాన్ని ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోర్‌గా మలచుకోలేకపోవడానికి అదే ప్రధాన కారణం. వాంఖడే స్టేడియం స్లోయర్ కావడం వారికి కలిసొచ్చింది. తరచూ బౌలింగ్ పేస్ మార్చారు ముంబై బౌలర్లు. సమయానుకూలంగా బౌలింగ్ చేశారు. యార్కర్లను ప్రయోగించారు. దూకుడుగా ఆడటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.

MI vs SRH 3 reasons for Sunrisers Hyderabad lost its match to Mumbai Indians in IPL 2025

ఆ రెండు ఓవర్లే నయం..

దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన 20వ ఓవర్‌లో మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకోగలిగారంతే. ఈ రెండు ఓవర్లే జట్టు స్కోర్‌ను 160ని దాటించగలిగాయి. దీపక్ చాహర్ బౌలింగ్‌లో 21, పాండ్యా బౌలింగ్‌లో 22 పరుగులు రాబట్టుకున్నారు.

బౌలర్ల ఫ్లాప్ షో..

టీ20 స్పెషలిస్ట్ బౌలర్ల ప్లాఫ్ షో.. మ్యాచ్ పరాజయానికి మరో కారణమైంది. మహ్మద్ షమీ వికెట్ లెస్‌గా మిగిలాడు. మూడు ఓవర్లల్లో 28 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇషాన్ మలింగ- 2, పాట్ కమ్మిన్స్- 3 వికెట్లు పడగొట్టినా పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయారు. జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్ పరిస్థితీ ఇంతే.

ఒత్తిడి తేవడంలో విఫలం..

ముంబై ఇండియన్స్ బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో బౌలర్లు విఫలం అయ్యారు. తామే స్వయంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. 32 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేయలేకపోయారు. ఆ జట్టు బౌలర్లు తమను ఏరకంగా అదుపు చేయగలిగారో.. దాన్ని సన్‌రైజర్లు బౌలర్లు కొనసాగించలేకపోయారు. బౌలర్ల నుంచి ఎలాంటి ప్రెజర్ లేకపోవడం వల్ల స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+