IND Vs NZ: రోహిత్ - విరాట్ కొనసాగటం ఇంకా.. హీట్ పెంచుతున్న కివీస్ కెప్టెన్..!!
India Vs New Zealand: మరో ఆసక్తికర క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చాలా రోజుల తరువాత తిరిగి రోహిత్ - విరాట్ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు అభిమానులకు అవకాశం దక్కింది. న్యూజీలాండ్ - భారత్ మధ్య సిరీస్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వన్డేల్లో రోహిత్ - కోహ్లీ ఆడనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో కివీస్ కెప్టెన్ బ్రేస్ వెల్ ఈ ఇద్దరూ టీంలో కొనసాగటం.. వారి ఆట పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు. తొలి వన్డే ముందు కివీస్ కెప్టెన్ కామెంట్స్ కీలకంగా మారుతున్నాయి.
న్యూజీలాండ్ - భారత్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టూర్ లో మూడు వన్డేలు, అయిదు టీ 20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నెల 11న వడోదరలో తొలి వన్డే ఆడనున్నారు. ఈ తొలి మ్యాచ్ లో రోహిత్ - కోహ్లీ ఆడటం ఖాయమైంది. దీంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే కివీస్ సారథి మైఖేల్ బ్రేస్‌వెల్ తాజాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

రోహిత్- విరాట్ వంటి గొప్ప ఆటగాళ్లను తక్కువ అంచనా వేయడం చాలా పెద్ద తప్పంటూ వారికి మద్దతుగా నిలిచారు. ఈ ఇద్దరు నెలకొల్పిన రికార్డులే వారి సత్తా ఏంటో చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వారు ఆడుతున్న తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ సమయంలో ఆ ఇద్దరు ఆటకు స్వస్తి పలకాల్సిన అవసరం లేదని కివీస్ సారధి పూర్తి మద్దతు ప్రకటించారు.
2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరి పైనా బ్రేస్‌వెల్ తన అంచనాలను వెల్లడించారు. వారు ఇంకా అత్యున్నత స్థాయి క్రికెట్ తో సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. 2027 వరల్డ్ కప్‌లో వారు భారత్ తరపున బరిలోకి దిగాలని తాను కోరుకుంటు న్నట్లు చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు జట్టులో ఉంటే ఆ బలం వేరుగా ఉంటుందని బ్రేస్ వెల్ పేర్కొ న్నారు. న్యూజీలాండ్ తో జరిగే మూడు వన్డేల్లో రోహిత్ - కోహ్లీ ఆడనున్నారు.
సిరీస్ లో భాగంగా జనవరి 11న వడోదరలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. రాజకోట్ (జనవరి 14), ఇండోర్ (జనవరి 18) వేదికల్లో రెండో.. మూడో వన్డే జరగనున్నాయి. తమ జట్టులో కీలక ఆటగాళ్లు మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర అందుబాటులో లేకపోయినా.. భారత్ పిచ్ లపైన తమకు పూర్తి అవగాహన ఉందని.. భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని బ్రేస్‌వెల్ చెప్పపుకొచ్చారు.












Click it and Unblock the Notifications