Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరేవి ఈ నాలుగు జట్లే- టీమిండియా స్టార్

ఐపీఎల్ 2026 సీజన్ రానురాను రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ముగిశాయి. ఈ మూడింట్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాయి. తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. ఇంకాస్సేపట్లో నాలుగో మ్యాచ్ జరుగనుంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. చండీగఢ్ దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ పరిస్థితుల మధ్య ప్లేఆఫ్స్ అంచనాలు సైతం వెలువడుతున్నాయి అప్పుడే. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తుది నాలుగు జట్లపై తన అంచనా వెల్లడించాడు. తన సొంత జట్టుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఓ పాడ్‌క్యాస్ట్ లో అతను మాట్లాడాడు. తన కేరీర్, విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి వివరించాడు. ఈ సీజన్ లో అతను లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడబోతోన్న విషయం తెలిసిందే. 10 కోట్ల రూపాయలకు అతన్ని ఎల్ఎస్జీ కొనుగోలు చేసింది.

Mohammed Shami Pics Top 4 Teams to enter IPL 2026 Playoffs and He did not hesitate to place his side

తన సొంత జట్టు లక్నో సూపర్ జెయింట్స్, గతంలో ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ చేరతాయని, పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తాయని షమీ అభిప్రాయపడ్డాడు. ఈ నాలుగు జట్లు అత్యంత పటిష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ఆల్ రౌండర్లు, సమయానుకూలంగా దూకుడుగా ఆడే ప్లేయర్లను కలిగివున్నాయని పేర్కొన్నాడు.

ఈ నాలుగింట్లో ఏ జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందని ఇప్పుడే అంచనాకు రాలేమని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ 2022లో అరంగేట్రం చేసిన తర్వాత రెండు అద్భుతమైన సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది గానీ.. ఆ తర్వాతి రెండు సీజన్‌లలో నిరాశపరిచింది. 2024 నుండి ప్లేఆఫ్ కు చేరుకోలేదు. ఈ సారి ఈ కొరత తీరుతుందని మహ్మద్ షమీ ధీమా వ్యక్తం చేశాడు. ఎల్ఎస్జీ కోసం సర్వశక్తులు ధారపోస్తానని చెప్పాడు.

విరాట్ కోహ్లీతో తన అనుబంధంపై మహ్మద్ షమీ మాట్లాడాడు. విరాట్ కోహ్లీపై తనకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని, కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, అతనితో కలిసి ఆడటం అనేది జీవితంలో తిరిగి రాని అద్భుతమైన జ్ఞాపకాలుగా అభివర్ణించాడు. అతనితో దిగిన ఫొటోలన్నింటినీ ట్రయల్ కోసం పంపితే, ఓ ఆర్టిస్ట్ వాటిని అన్నింటినీ ఆయిల్ పెయింట్ గా చిత్రించాడని తెలిపాడు.

షమీ తన కెరీర్ చివరి దశకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే అవకాశాలు తక్కువే. తన కెరీర్‌లోని అన్ని అత్యుత్తమ క్షణాలతో కూడిన ఆత్మకథను రాయాలని షమీ భావిస్తోన్నాడు. 2013లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడీ ఫాస్ట్ బౌలర్. ఆ తర్వాత ఢిల్లీ కేపిటల్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ ఎంపిక అయ్యాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+