డబ్బుల కోసమే ఇదంతా.. అసదుద్దీన్ ఒవైసీ సంచలనం!

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా మహిళల ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి భారత మహిళల క్రికెట్ జట్టు నిరాకరించడంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడాన్ని సమర్థిస్తూనే అసలు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 'ఇదేం పిచ్చితనం.. ఓ వైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినప్పుడు, మరోవైపు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడటం ఏంటి? అలాంటప్పుడు ఐసీసీ ఒప్పందం ఎలా తప్పనిసరి అవుతుంది?' అని అన్నారు.

భారత్‌కు రానున్న పాకిస్తాన్ జట్టు.. ఎక్కడ, ఎప్పుడు మ్యాచ్‌లు?
భారత్‌కు రానున్న పాకిస్తాన్ జట్టు.. ఎక్కడ, ఎప్పుడు మ్యాచ్‌లు?

టీవీ ప్రసార హక్కులు, వ్యాపార లాభాల ద్వారా బిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించుకోవడానికి బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 'పహల్గామ్‌లో ఉగ్రవాదుల చేతిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి పట్ల ప్రభుత్వానికి ఎందుకు సానుభూతి లేదు?" అని ఒవైసీ ప్రశ్నించారు. "ఇంకా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో మీరెందుకలా ఆడుకుంటున్నారు? ఎర్రకోట వద్ద ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా పాకిస్తానే ఉంది " అని ఒవైసీ అన్నారు.

Money Over Nation Asaduddin Owaisi Slams BCCI and Govt Over India-Pakistan Cricket Full Details

ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ, ట్రోఫీ ప్రదానం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది.ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మహిళల ఆసియా కప్‌లో భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి విజయం సాధించింది. షఫాలీ వర్మ, స్మృతి మంధానల అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనల అనంతరం, భారత బౌలర్లు శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు.

మొహ్సిన్ నఖ్వీకి బిగ్ పంచ్.. హర్మన్‌ప్రీత్ చేసిన పని చూస్తే నవ్వాల్సిందే! (వీడియో)
మొహ్సిన్ నఖ్వీకి బిగ్ పంచ్.. హర్మన్‌ప్రీత్ చేసిన పని చూస్తే నవ్వాల్సిందే! (వీడియో)

ఫైనల్‌కు ముందే, బహుమతి ప్రదానోత్సవానికి మొహ్సిన్ నఖ్వీ హాజరైతే, అతని చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీని స్వీకరించదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది పురుషుల ఆసియా కప్ లో పాకిస్తాన్‌ను ఓడించిన సమయంలోనూ టీమిండియా ఇదే విధంగా మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఈ నిర్ణయం మరోసారి ఏసీసీ, బీసీసీఐల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+