భారత్‌కు రానున్న పాకిస్తాన్ జట్టు.. ఎక్కడ, ఎప్పుడు మ్యాచ్‌లు?

వచ్చే నెలలో భారత గడ్డపై ఆసియా హాకీ సమరం జరగనుంది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్ వేదికగా ఏహెచ్ఎఫ్ పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 టోర్నమెంట్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో ఆతిథ్య భారత జట్టుతో పాటు పాకిస్తాన్, చైనా, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు భాగస్వామ్యాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అధికారికంగా ధ్రువీకరించారు.

సంజు శాంసన్ ఫ్లాప్ షో- తడాఖా చూపిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
సంజు శాంసన్ ఫ్లాప్ షో- తడాఖా చూపిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్

పాకిస్తాన్ జట్టు భారత పర్యటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందిస్తూ.. బహుళజాతి టోర్నమెంట్లలో పాకిస్తాన్‌తో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వ విధానల ప్రకారం ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేదం ఉన్నప్పటికీ.. బహుళ దేశాలు పాల్గొనే ఈవెంట్లలో ఆడేందుకు ఇరు దేశాలకు అనుమతి ఉంది. స్టేడియంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ.. ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం ఉందని.. హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ కూడా ఇరు దేశాల హాకీ ఫెడరేషన్ల మధ్య నుంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

Pakistan Hockey Team to Visit India for Asian Champions Trophy 2026 Schedule Revealed Full Details

ఎక్కడ, ఎప్పుడు?
ఈ టోర్నీ మ్యాచ్‌లు పంజాబ్‌లోని రెండు ప్రధాన నగరాల్లో జరగనున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లకు జలంధర్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లను మొహాలీలోని హాకీ స్టేడియంలో నిర్వహించనున్నారు. లీగ్ దశలో భాగంగా నవంబర్ 1న జలంధర్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఏదైనా కారణాల వల్ల ప్రధాన జట్లు వైదొలిగితే ప్రత్యామ్నాయంగా ఒమన్, బంగ్లాదేశ్ జట్లను రిజర్వ్‌లో ఉంచారు.

హ్యాట్రిక్ టైటిల్‌పై టీమిండియా కన్ను
ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత హాకీ జట్టు వరుసగా మూడోసారి టైటి‌ల్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. 2023లో చెన్నై వేదికగా, 2024లోని చైనాలోని హులున్‌బ‌ర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. గత సంవత్సరం ఈ టోర్నీ జరగకపోవడంతో ఈ సారి పంజాబ్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆండ్రీ రస్సెల్‌నే దాటేశాడు.. టీ20ల్లో రికార్డుల రారాజుగా అభిషేక్ శర్మ!
ఆండ్రీ రస్సెల్‌నే దాటేశాడు.. టీ20ల్లో రికార్డుల రారాజుగా అభిషేక్ శర్మ!

గతంలో తమిళనాడులో జరిగిన జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుంచి దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ వైదొలిగింది. అయితే ఈ సారి పరిస్థితి అనుకూలంగా ఉండటంతో పాకిస్తాన్ జట్టు భారత పర్యటనకు సిద్ధమైంది. దీంతో చాలా కాలం అనంతరం మళ్లీ భారత గడ్డపై ఇండో-పాక్ హాకీ సమరాన్ని చూసే అవకాశం క్రీడాభిమానులకు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+