హార్ధిక్ పాండ్యాకు ముంబై ఫ్యాన్ సారీ... టీ20 వరల్డ్ కప్ ప్రదర్శనతో మళ్లీ..!

తాజాగా బార్బడోసే లో జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్లో అద్భుత ప్రదర్శనతో భారత్ కు టైటిల్ అందించిన హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అసమాన ఆల్ రౌండింగ్ ప్రతిభతో టీ20ల్లో భారత్ రెండోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాపై టీమిండియా అభిమానులతో పాటు అతని ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా ప్రశంసలు కురిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ అభిమాని హార్ధిక్ పాండ్యాకు సారీ చెప్పడం చర్చనీయాంశమైంది.

బార్బడోస్ నుంచి ఇవాళ స్వదేశానికి తిరిగి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమ్ ఇండియా ఆ తర్వాత ముంబైకి బయలుదేరింది. ప్రధానమంత్రితో తమ భేటీ ముగించుకున్న భారత బృందం రోడ్ షో కోసం ముంబైకి వెళ్లింది. ముంబై విమానాశ్రయం చుట్టూ అభిమానులు గుమిగూడి జట్టుకు స్వాగతం పలికారు. అదే సమయంలో ఐపీఎల్ 2024 సీజన్‌లో తనను దుర్భాషలాడినందుకు హార్దిక్ పాండ్యాకు అభిమానుల్లో ఒకరు ఉద్వేగభరితమైన క్షమాపణలు చెప్పారు.

Mumbai Indian s fan apology to Hardik Pandya after heroics in T20 Wold cup Final

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా పాండ్యాను దుర్భాషలాడినందుకు ఆ అభిమాని లైవ్ టీవీలో భారత జట్టును అభినందించేందుకు ముంబై విమానాశ్రయంలో నిలబడి క్షమాపణలు చెప్పాడు. గతంలో పాండ్యాను ఆపార్ధం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్తున్నట్లు అతను పేర్కొన్నాడు. గతంలో ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ స్ధానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్ధిక్ పాండ్యాను ఫ్రాంజైజీ ఎంచుకోవడం, దీన్ని జీర్ణించుకోలేక భారీ స్దాయిలో అభిమానులు జట్టును సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం జరిగాయి. దీనిపై ఇప్పుడు అభిమానులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+