ఐపీఎల్ నుంచి RCB బ్యాన్..?

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో 11 మంది అమాయక అభిమానులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దశాబ్దాల కలను సాకారం చేసుకున్న సంతోషం, అకస్మాత్తుగా జరిగిన విషాదాంతంగా మారింది.

అనూహ్యంగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్సీబీకి స్వాగతం పలికేందుకు, విజయోత్సవ వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అభిమానుల రద్దీని నియంత్రించడంలో లోపాలు తలెత్తడంతో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 100 మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది.

Netizens demand RCB be banned from IPL

ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆర్సీబీని బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.18 ఏళ్ల తర్వాత కోహ్లీ టీం ఐపీఎల్ టైటిల్ గెలిచిందనే ఆనందం కన్నా, వీరి సంబరాల వల్ల 11 మంది మరణించారనే బాధే ఎక్కువగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత తర్వాత ఆర్సీబీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు 18 ఏళ్లు బ్యాన్ చేయాలని కోరుతుండగా, మరి కొందరు ఆర్సీబీపై జీవితకాలం నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ ఘోరం జరిగినప్పటికీ, ఆర్సీబీ టీం తమ విజయోత్సవ వేడుకలను నిలిపివేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్టేడియం వెలుపల అభిమానులు ప్రాణాలు కోల్పోతుంటే, లోపల సంబరాలు కొనసాగించడంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+