పాకిస్థాన్ టీం కొంప ముంచిన హైదరాబాద్ బిర్యానీ - మైండ్ బ్లాక్..!!

క్రికెట్ అభిమానులకు పండుగ మొదలైంది. మరి కొద్ది గంటల్లో ప్రపంచ కప్ సమరం ఆరంభం అవుతోంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లు చివరి వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రపంచ కప్ మ్యాచులు ఏ స్థాయిలో ఉంటాయో ముందే ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సమయంలోనే భారత్ చిరకాల ప్రత్యర్ధి..దాయాది టీం పాకిస్థాన్ కు హైదరాబాద్ లో అడుగు పెట్టిన సమయం నుంచి అదిరిపోయే అతిధ్యం అందుతోంది. కానీ, వరుసగా వార్మప్ మ్యాచుల్లో ఓడిపోయారు. ఇందుకు అసలు కారణం మాత్రం కామెంట్రేటర్లకు మైండ్ పోయేలా చేసింది.

పాక్ టీం ఫిధా : భాగ్యనగరంలో తమకు అందిన గ్రాండ్ వెల్కమ్ కు పాకిస్థాన్ టీం ఫిదా అయింది. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి హోటల్ కు చేరుకొనే వరకూ స్థానికుల నుంచి వచ్చిన స్పందిన పాకిస్థాన్ మీడియాలో నూ హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఏడేళ్ల తరువాత భారత్ కు అందునా...మినీ భారత్ కు మరోరూపంగా నిలిచే హైదరాబాద్ లో పాకిస్థాన్ టీంకు విడిది స్పెషల్ మెమోరీగా మారిపోతోంది. ఇక్కడ వార్మప్ మ్యాచ్ లతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగానే పాకిస్థాన్ ప్రపంచ కప్ తో తొలి రెండు మ్యాచ్ లు ఆడనుంది. అగ్రశ్రేణి టీంల్లో సెమీస్ కు చేరే టీంల్లో ఒకటిగా అంచనాల్లో నిలిచిన పాకిస్థాన్ రెండు వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిపోయింది.

బిర్యానీ ఓడించింది : పాకిస్థాన్ రెండు మ్యాచ్ ల్లోనూ ఓటిమికి వారి ఆట తీరు మాత్రమే కారణం కాదు. ఇక్కడ హైదరాబాదీ స్పెషల్ రీజన్ మరొకటి ఉంది. ఈ విషయాన్ని స్వకంగా పాకిస్థానం వైస్ కెప్టన్ షాదాబ్ ఖాన్ బయట పెట్టాడు. పాకిస్థాన్ భారీ అంచనాలతో ప్రపంచ కప్ కు సమాయత్తం అవుతున్న సమయంలో రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ ఓడటానికి కారణం హైదరాబాద్ బిర్యానీయేనని చెప్పుకొచ్చాడు. భారత్ కు వచ్చిన సమయం నుంచి హైదరాబాద్ లోనే ఉంటూ..బిర్యానీ తింటూ ప్లేయర్లు బాగా బద్దకంగా తయారయ్యారని అంగీకరించాడు. ఆ బిర్యానీ ఎఫెక్ట్ తో గ్రౌండ్ లో కదలికలు సరిగ్గా లేవంటూ కామెంట్ చేసాడు. సరాదాగా ఈ కామెంట్ చేస్తూనే..షాదాబ్ ఉన్న విషయమే చెప్పాడంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Pakistan Player Shadab reveals interesting reason after loosing Warm up matches

సమరానికి సై : ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ లో చివరి వరకు పోరాటం చేసిన పాకిస్థాన్ చివర్లో తడబడింది. ప్రపం కప్ ముందు వార్మప్ మ్యాచ్ ల ఫలితం కంటే..సిసలైన సమరానికి సిద్దం కావటమే అసలు లక్ష్యమని షాదాబ్ చెప్పుకొచ్చాడు. తమ ఆట బాగుందని..ఫలితం మాత్రం తమ చేతుల్లో లేదన్నాడు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ తో, 10న శ్రీలంకతో పాకిస్థాన్ తల పడనుంది. ఇక ఆసీస్ తో ఓటమి తరువాత హైదరాబాద్ బిర్యానీ గురించి షాదాబ్ చేసిన కామెంట్స్ తో కామెంట్రేటర్స్ కు మైండ్ బ్లాక్ అయింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ కప్ సమయంలో పాకిస్థాన్ టీం కు హైదరాబాద్ బిర్యానీ అందకుండా చూడంటంటూ కామెంట్స్ చేస్తూ..అభిమానులు సందచి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+