నేటి నుంచే సూపర్ 8: పాకిస్తాన్ కు ప్రతి మ్యాచ్ సెమీసే

నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ లో మలి అంకం మొదలుకాబోతోంది. సూపర్ 8 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ సాయంత్రం 7 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించనున్నాయి. పాకిస్తాన్ కు అగ్నిపరీక్షగా మారిందీ సూపర్ 8. భారత్ తో తప్ప గ్రూప్ దశలో మిగిలిన అన్నింట్లోనూ గెలిచింది గానీ అవి చిన్నజట్లే. ఇక్కడ సమవుజ్జీలతో తలపడాల్సి ఉంది.

బలమైన స్పిన్ బౌలర్లు పాకిస్తాన్ కు ప్లస్ పాయింట్ కాగా.. బ్యాటింగ్‌లో నిలకడలేమి ఆ జట్టును వేధిస్తోంది. నమీబియాపై ఆడిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది పాకిస్తాన్. అదే ఫామ్ కనపర్చితే.. టఫ్ ఫైట్ ఇస్తుంది. టాప్ ఆర్డర్ కూడా క్రమంగా ఫామ్ లోకి వచ్చిందా మ్యాచ్ తో. బ్యాటర్లు తమ రిథమ్ ను అందిపుచ్చుకున్నారు. ఇది ఆ జట్టులో కొంత ఉత్సాహాన్ని నింపే అంశం. నిలకడలేమి ఎంత వరకు ప్రభావం చూపుతుందనేది పాయింట్.

Pakistan will Face New Zealand in T20 World Cup Super 8 today at R Premadasa Stadium in Colombo

మరోవైపు న్యూజిలాండ్ ఈ టోర్నమెంట్ పొడవునా బ్యాలెన్స్డ్ గా కనిపించింది. దక్షిణాఫ్రికాతో తప్ప మిగిలిన మ్యాచ్ లల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు శుభారంభాలను అందిస్తోన్నారు. మిగిలిన బ్యాటర్లు దీన్ని భారీ స్కోర్ గా మలచడంలో సక్సెస్ అవుతున్నారు. బౌలింగ్ డిపార్ట్ మెంట్ ఒత్తిడిలో కూడా తమ గేమ్ ప్లాన్ పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తోంది.

జియో స్టార్ నెట్‌వర్క్ ఛానెల్స్, జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్ ఈ మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో నాలుగుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఒకసారి మాత్రమే ఛేజింగ్ టీమ్ గెలిచింది. ఛేజింగ్ చేయడానికే జట్టు కేప్టెన్‌లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఇక్కడా కొనసాగవచ్చని అంచనా. ఇప్పటివరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య 49 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో న్యూజిలాండ్ 23, పాకిస్తాన్ 24 సార్లు విజయం సాధించాయి. టై / ఫలితం తేలనివి.. రెండు.

Take a Poll

న్యూజిలాండ్ తుది జట్టులో- టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మాన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కేప్టెన్), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ ఆడొచ్చు.

పాకిస్తాన్ తుదిజట్టులో- సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా (కేప్టెన్), ఖవాజా, షాదాబ్ ఖాన్, బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+