Ind-Pak Match: భారత బ్యాటర్లపై పాక్ మిస్టరీ స్పిన్నర్ 'ఎక్స్ ట్రా' కామెంట్స్..!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 15న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా కీలక పోరు జరగబోతోంది. అయితే ఈ పోరుకు ముందే భారత్ ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. గతంలో పలుమార్లు ఇలాంటి ప్లాన్లు వేసి విఫలమైనా మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు దాయాది ప్లేయర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత బ్యాట్స్ మెన్ పై పాకిస్తాన్ కు చెందిన వివాదాస్పద మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq) ఎక్స్ ట్రా వ్యాఖ్యలు చేశాడు.

తన బౌలింగ్ యాక్షన్ పై జరుగుతున్న పరిశీలన కచ్చితంగా భారత బ్యాట్స్ మెన్ ను ఎక్స్ ట్రా ఒత్తిడిలోకి నెడుతుందని ఉస్మాన్ తారిఖ్ తెలిపాడు. వారిపై అదనపు ఒత్తిడి ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. వారు ఈ విషయాలను చర్చిస్తున్న విధానం, వారిపై ఒత్తిడి ఉండవచ్చని చూపిస్తుందన్నాడు. కానీ మీడియాలో ఏమి జరుగుతుందో తనకు నిజంగా తెలియదన్నాడు. తాను తన క్రికెట్, తన ప్రాక్టీస్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానన్నాడు. భారత్ తో మ్యాచ్ తనకు కేవలం మరో ఆట మాత్రమే అన్నాడు.

Pakistan s Usman Tariq Facing Action Scrutiny Claims India Batters Will Be Under Extra Pressure

భారత్ తో జరిగే మ్యాచ్ లో తాము ఒక విషయంపై దృష్టి పెడుతున్నామన్నారు. మనకు వచ్చే ఏ ఆట అయినా, మనం ఆడే ఏ ఆట అయినా, మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్నారు. అలాగే తాము ఈ ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలన్నాడు. దానిని అందరికీ గుర్తుండిపోయేలా చేయాలన్నాడు. కాబట్టి ఇది నాకు, జట్టుకు ఒక సాధారణ ఆట అని తేల్చేశాడు. మీరు ఆ హైప్ లేదా ఆ రకమైన విషయాన్ని మీ మనస్సులో పొందుతున్నప్పుడు, దానిని సరళంగా ఉంచుకోవడం, ప్రణాళికలకు కట్టుబడి ఉండటం మంచిదన్నాడు. భారత్ -పాక్ మ్యాచ్ పై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో పాక్ క్రికెటర్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+