SRH కెప్టెన్ మార్పు లేదా ? కమ్మిన్స్ ఎంట్రీ వేళ బిగ్ ట్విస్ట్..!
గాయం కారణంగా ఈసారి ఐపీఎల్ సీజన్ (IPL 2026)లో ఆరంభ మ్యాచ్ లకు దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) తాజాగా తిరిగి జట్టుతో చేరాడు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంతో పోలిస్తే ఇషాన్ కిషన్ (Ishan Kishan) నాయకత్వంలో గాడిన పడింది. అలాగే ఈ నెల 25న రాజస్తాన్ రాయల్స్ తో జరిగే కీలక మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ ఆడబోతున్నాడు. దీంతో కమ్మిన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా లేక ఇషాన్ కిషనే కొనసాగుతాడా అన్న సస్సెన్స్ నెలకొంది.
గతంలో SRH ఫైనల్ చేరడంలో ప్యాట్ కమ్మిన్స్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సీజన్‌లో అతని గైర్హాజరీతో జట్టులో మార్పులు తప్పలేదు. ముఖ్యంగా ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో సన్ రైజర్స్ జట్టు స్వరూపాన్ని మార్చడానికి ఒక కొత్త నాయకుడు అవసరమయ్యాడు. ఆ బాధ్యత ఇషాన్ కిషన్‌పై పడింది. అతను కమిన్స్ లేని సమయంలో జట్టుకు నాయకత్వం వహించాడు. మొదట్లో తాత్కాలిక ఏర్పాటుగా ఇది కనిపించినా.. తక్కువ సమయంలోనే కిషన్ బలమైన కెప్టెన్ గా ఎదిగాడు. కిషన్ గందరగోళ ఆరంభం ఎదుర్కొన్న సన్ రైజర్స్ ను ముందుకు నడిపించి, స్థిరమైన, విజయవంతమైన జట్టుగా మార్చాడు.

కానీ గాయం నుంచి కోలుకుని కమిన్స్ ఇప్పుడు జట్టులోకి తిరిగి రావడంతో, గతంలో నిరూపించుకున్న ప్యాట్ కమ్మిన్స్ వైపు మొగ్గాలా లేక తమ జట్టుకు ఊపునిచ్చిన యువ కెప్టెన్ ఇషాన్ కిషన్ కు మద్దతు ఇవ్వాలా అన్న దానిపై ఎస్ఆర్హెచ్ సస్పెన్స్ లో పడింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయకత్వంలోనే జట్టును కొనసాగించాలని మాజీ ఆఫ్-స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. పాట్ కమిన్స్ తిరిగి వచ్చినా కూడా ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కొనసాగాలన్నాడు. ఇది చర్చనీయాంశమే, కానీ జట్టు ఒక యువ నాయకుడికి మద్దతు ఇస్తే, అతనితోనే ఉండాలన్నాడు.

2024లో ఎస్ఆర్‌హెచ్‌ను ఫైనల్‌కు నడిపించడంలో కమిన్స్ ప్రభావాన్ని భజ్జీ అంగీకరించినప్పటికీ, కిషన్ నాయకత్వంలో ప్రస్తుత జట్టు కుదురుకున్నట్లు కనిపిస్తోందన్నాడు. బౌలర్లు, ఇతర ఆటగాళ్లు అతనితో మంచి సమన్వయం ఏర్పరచుకున్నారని తెలిపాడు. ఇషాన్‌ను కెప్టెన్‌గా ఉంచడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రయోజనం చేకూరుస్తుందన్నాడు. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంకర్ కూడా ఫిట్ నెస్ కుదురుగా లేని ప్యాట్ కమ్మిన్స్ కంటే కిషన్ ను కొనసాగిస్తేనే మంచిదని సూచిస్తున్నాడు. దీంతో ప్రస్తుతానికి కిషన్ వైపే సన్ రైజర్స్ మొగ్గే అవకాశాలు లేకపోలేదు.














Click it and Unblock the Notifications