SRH vs CSK: మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ ఆడతాడా ? తేల్చేసిన SRH..!

ఫిట్ నెస్ పరీక్షల కోసం స్వదేశానికి వెళ్లిన ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) త్వరలో జట్టుకు తిరిగి అందుబాటులోకి రాబోతున్నాడు. ఇప్పటికే పడుతూ లేస్తూ సాగుతున్న సన్ రైజర్స్ ప్రయాణం నేపథ్యంలో కమ్మిన్స్ తిరిగి వస్తే జట్టుకు ఎంతో ఉపయోగం ఉంటుందని ప్రాంచైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కమ్మిన్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ కు కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై జట్టు కోచ్ వెటోరీ క్లారిటీ ఇచ్చాడు.

నిన్న జట్టుతో చేరిన ప్యాట్ కమ్మిన్స్ ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని కోచ్ వెటోరీ వెల్లడించాడు. తన పనిభారాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్న కమిన్స్ ను ఈ నెల 25న రాజస్తాన్ రాయల్స్ తో జరిగే కీలక మ్యాచ్ లో ఆడించాలని సన్ రైజర్స్ భావిస్తోంది. అందుకే అప్పటివరకూ అతనికి తగినంత విశ్రాంతి నిచ్చి, ప్రాక్టీస్ చేయించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 25న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ లో కమ్మిన్స్ ఆడతాడని వెటోరీ ప్రకటించాడు.

No Pat Cummins vs CSK Vettori Confirms SRH Captain Targeting April 25 Return Against RR

టోర్నమెంట్ చివర్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో, సన్ రైజర్స్ కెప్టెన్ కమ్మిన్స్ ను జాగ్రత్తగా వాడుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. కమ్మిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలకడలేని ఆరంభాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంలో ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాజాగా యువ పేసర్లు ప్రఫుల్ హింజ్ , షకీబ్ హుస్సేన్‌ల ఆవిర్భావం సరైన సమయంలో జట్టుకు ఊపునిచ్చింది. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ ఇద్దరూ నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుని, సన్ రైజర్స్ తమ బౌలింగ్ విభాగంలో తిరిగి బ్యాలెన్స్ సాధించడంలో సాయపడ్డారు. అయితే ఇవాళ చెన్నై తో మ్యాచ్ కు వ్యూహాత్మక మార్పులకు సిద్ధమవుతున్న సన్ రైజర్స్ కు రెగ్యులర్ కెప్టెన్ కమ్మిన్స్ లేకపోవడం తక్షణ సవాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+