IPL 2026: బుమ్రా-హార్ధిక్ మధ్య చిచ్చురేపిన పంజాబ్ మ్యాచ్..! ఏంటీ కెప్టెన్సీ..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ (mumbai indians) జట్టులో చిచ్చు రేగింది. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్ ల్లో నాలుగు ఓటములతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండో స్ధానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ లో అసహనం పెరుగుతోంది. ముఖ్యంగా నిన్నటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా (Hardik pandya) కెప్టెన్సీ తీరుపై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (jasprit bumrah) బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. అసలే ఈ టోర్నీలో వికెట్ రాక ఇబ్బందులు పడుతున్న బుమ్రాకు హార్దిక్ ఫీల్డ్ సెట్టింగ్ లు అస్సలు నచ్చలేదు.

Ishan Kishan: రాజస్థాన్ మ్యాచ్ తెచ్చిన మార్పు-ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం..!
Ishan Kishan: రాజస్థాన్ మ్యాచ్ తెచ్చిన మార్పు-ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం..!

పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను బట్టి తెలుస్తోంది. నిన్న ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ముంబై ఇచ్చిన 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 16.3 ఓవర్లలోనే ఏడు వికెట్ల తేడాతో ఛేదించడంతో ఆ జట్టు ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి అనంతరం, హార్దిక్‌పై బుమ్రా (bumrah-hardik) తీవ్ర అసంతృప్తితో ఉన్న వీడియో ఒకటి ఎక్స్ లో వైరల్ అవుతోంది.

Bumrah-Hardik Clash MI Star s Frustrated Reaction to Captain s Field Call Goes Viral
IPL 2026: బుడ్డోడి వీక్ నెస్ బయటపెట్టేసిన ప్రఫుల్..! ఇతర బౌలర్లకూ అస్త్రం?
IPL 2026: బుడ్డోడి వీక్ నెస్ బయటపెట్టేసిన ప్రఫుల్..! ఇతర బౌలర్లకూ అస్త్రం?

మ్యాచ్‌లో కీలక సమయంలో ముంబై కెప్టెన్ తన సొంత వ్యూహం ప్రకారం ఫీల్డింగ్‌ను మార్చాలని నిర్ణయించుకోవడం బుమ్రాకు నచ్చలేదు. మొదట వాదనకు దిగినప్పటికీ, బుమ్రా చివరికి తన కెప్టెన్ నిర్ణయానికి తలొగ్గి నిరాశగా కనిపించాడు. అదే ఫుటేజ్‌లో, మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన పట్ల తన అసంతృప్తిని సూచిస్తూ, హార్దిక్ ఫీల్డర్లను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడటం కనిపించింది. అలాగే పంజాబ్‌తో ఓటమి తర్వాత జట్టు ప్రదర్శనపై విమర్శలు చేయడంలో హార్దిక్ పాండ్యా ఏమాత్రం వెనుకాడలేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ప్రదర్శన పట్ల ముంబై కెప్టెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కీలక మార్పులు అవసరమా కాదా అని తేల్చేందుకు సమగ్ర సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+