IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్రకటన-కమ్మిన్స్ స్ధానంలో..!

ఈ నెలాఖరులో ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభమవుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లకు దూరమవుతున్న నేపథ్యంలో అతని స్ధానంలో తాత్కాలిక కెప్టెన్ కు ప్రకటించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (ishan kishan)ను కెప్టెన్ గా సన్ రైజర్స్ అవకాశం కల్పించింది. ఇప్పటికే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న ఇషాన్ కిషన్ కు పలు జట్లకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2026లోని తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న కమ్మిన్స్.. ఐపీఎల్ లో ఆలస్యంగా చేరే అవకాశం ఉంది. గాయం కారణంగా ఇప్పటికే యాషెస్ టెస్టుల్లో ఒకదానిలో మాత్రమే ఆడిన కమ్మిన్స్.. తాజాగా టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

SRH Stuns Ishan Kishan New Captain as Cummins Misses IPL 2026 Start

దీంతో కమ్మిన్స్ గైర్హాజరీలో సన్ రైజర్స్ జట్టుకు ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇషాన్ కిషన్ కెప్టెన్ గా , మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. తాజాగా వరల్డ్ కప్ లో కిషన్ అద్బుత ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటుకున్నాడు. జార్ఖండ్ తమ తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడంలో కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతనికి 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులోకి తిరిగి రావడానికి కూడా పనికొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+