Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ టీమ్ మారబోతున్నాడా ? భారత మాజీ హింట్..!

గతేడాది ఐపీఎల్ (ipl 2025)లో రాజస్థాన్ రాయల్స్ ద్వారా ఇండియన్ క్రికెట్ లీగ్ లోకి అడుగుపెట్టిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. ఈ ఏడాది ఐపీఎల్ (ipl 2026)లోనూ తన దూకుడు కొనసాగిస్తున్నాడు. దీంతో అతన్ని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఒకరు వైభవ్ భవిష్యత్తుపై సంచలన జోస్యం చెప్పాడు. అతను ఐపీఎల్ లో టీమ్ మారబోతున్నట్లు వెల్లడించాడు.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత క్రికెటర్ జతిన్ పరంజపే సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఇందులో "వైభవ్ సూర్యవంశీ ఈ రాత్రి తన భవిష్యత్ జట్టుతో ఆడుతాడని పోస్ట్ చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్ తో ప్రస్తుతం వైభవ్ ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ఆడటం, అందులో అతను టాప్ షాట్లతో అలరించడం, తన జట్టు గెలవడం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు పరాంజపే పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.

Vaibhav Sooryavanshi to MI next Former India cricketer s post triggers speculation

వైభవ్ సూర్యవంశీ ఇలా ముంబై ఇండియన్స్‌ లోకి వెళ్లాడంటూ పరాంజపే ఇచ్చిన సంకేతం వెనుక ఓ కీలక కారణం ఉంది. ముంబై ఫ్రాంచైజీ దేశీయ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో ముందుంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా (2013), హార్దిక్ పాండ్యా (2015), కృనాల్ పాండ్యా (2016), సూర్యకుమార్ యాదవ్ (2012), ఇషాన్ కిషన్ (2018), తిలక్ వర్మ (2022) వంటి ఆటగాళ్లంతా ఆ జట్టు నుంచే ఉన్నత స్థాయికి ఎదిగారు. దీన్ని బట్టి సూర్యవంశీని తమ తదుపరి స్టార్‌గా అభిమానులు, నిపుణులు ఊహిస్తున్నారు.

Vaibhav Sooryavanshi to MI next Former India cricketer s post triggers speculation

2024లో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ ను ₹1.1 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 ఐపీఎల్‌లో వైభవ్ దుమ్మురేపాడు. గుజరాత్ టైటాన్స్‌పై 38 బంతుల్లో 101 పరుగులు చేసి, పురుషుల టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయసులో సెంచరీ సాధించాడు. అతని 35 బంతుల్లో సెంచరీ ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైనది. గౌహతిలో తాజాగా ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కొన్న తర్వాత సూర్యవంశీపై ప్రచారం మరింత ఊపందుకుంది. టీమిండియా టాప్ పేసర్‌ను తొలిసారి ఎదుర్కొన్న వైభవ్.. తొలి బంతికే లాంగ్-ఆన్‌ మీదుగా సిక్స్ బాదాడు. కొద్దిసేపటి తర్వాత అద్భుతమైన పుల్ షాట్‌తో మరో సిక్స్ కొట్టి, 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇది రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల విజయంలో కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+