Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?

PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2026) 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఆ దేశ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అందింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఈ సారి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయించింది. దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అధికారికంగా ప్రకటించారు.

రెండు నగరాలకే పరిమితం.. ప్రారంభ వేడుకల్లేవ్!
వాస్తవానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నీని ఆరు నగరాల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల కేవలం కరాచీ, లాహోర్ నగరాల్లోనే మ్యాచ్ లు జరగనున్నాయి. అంతే కాకుండా ఈ సారి పీఎస్ఎల్ 2026 ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేస్తున్నట్లు మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించే ప్రసక్తే లేదని నఖ్వీ తేల్చి చెప్పారు.

PSL 2026 Empty Stadiums and No Opening Ceremony PCB Refunds Tickets Amid National Crisis

ప్రభుత్వం, భద్రతా సంస్థల నిర్ణయం
ఈ విషయంపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. "పీఎస్ఎల్ మా ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇందులో విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి టోర్నీని రద్దు చేయలేం. అయితే 25-30 వేల మందిని స్టేడియానికి పిలిచే పరిస్థితి ఇప్పుడు లేదు" అని పేర్కొన్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, భద్రతా సంస్థలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో ఇంధన సంక్షోభం కారణంగా ప్రజల రాకపోకలను పరిమితం చేయాలని.. పాఠశాలలకు సెలవులు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తున్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ లకు వేల మందిని ఆహ్వానించడం సరికాదని నఖ్వీ అభిప్రాయపడ్డారు.

టికెట్ డబ్బులు రీఫండ్
ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు వచ్చే 72 గంటల్లో డబ్బులు రీఫండ్ చేస్తామని బోర్డు ప్రకటించింది. అలాగే ప్రేక్షకులను అనుమతించకపోవడం వల్ల ఫ్రాంచైజీలకు వచ్చే నష్టాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిహారంగా చెల్లించనుంది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 పూర్తి వివరాలు
ఈ సారి పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో మొదటిసారిగా 8 జట్లు తలపడనున్నాయి. మార్చి 26 నుంచి మే 3 వరకు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సారి హైదరాబాద్ కింగ్స్‌మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి పిండిస్ జట్లు పాల్గొననున్నాయి. ప్రతి జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ 4 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయి. మే 3న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో ఫైనల్ పోరు జరుగుతుంది. వర్షం పడితే రిజర్వ్ డే కూడా కేటాయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+