World Cup 2023: జట్టు కూర్పులో పెను మార్పు: కొత్త టీమ్ ప్రకటన
ముంబై: ఈ ఏడాది ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ముందు బిగ్గెస్ట్ టాస్క్. ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో ఆడాల్సి ఉంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది.
ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది.

నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ కూడా నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
ఈ పరిస్థితుల్లో భారత జట్టులో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గాయపడ్డ అక్షర్ పటేల్‌ను దూరం పెట్టింది బీసీసీఐ. ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ ఆడే జట్టు నుంచి తప్పించింది. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ ఆడే సమయంలో అక్షర్ పటేల్ గాయపడిన విషయం తెలిసిందే.
అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అయ్యాడు. మొన్నటివరకు టెస్ట్ మ్యాచ్‌లకే పరిమితమైన ఈ తమిళనాడు సీనియర్ ఆల్ రౌండర్.. ఏకంగా వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో రాణించడంతో అతణ్ని ఎంపిక చేసింది బీసీసీఐ.
తొలి రెండు మ్యాచ్‌లల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ పెర్ఫార్మెన్స్ నచ్చడంతో రవి అశ్విన్‌ను వరల్డ్ కప్ ఆడే జట్టులోకి తీసుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో తలపడే తుదిజట్టులో అశ్విన్‌కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజాగా ప్రకటించిన భారత జట్టు- రోహిత్ శర్మ (కేప్టెన్), హార్దిక్ పాండ్యా (వైఎస్ కేప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications