అదో పెద్ద స్కామ్..సంచలన విషయాలు బయటపెట్టిన రవిచంద్రన్ అశ్విన్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా క్రికెటర్లలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అశ్విన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా కనిపిస్తారు. అభిమానులతో ముచ్చటిచ్చడంలో అశ్విన్ తర్వాతే ఏ క్రికెటరైనా. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో బాగా టచ్‌లో ఉంటాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదే సమయంలో భారత జట్టుపై విదేశి ఆటగాళ్లు ఎవరైనా విమర్శలు చేస్తే.. సోషల్ మీడియా వేదికగా మనోడు వారికి అదిరిపోయే కౌంటరిస్తుంటాడు. అయితే అశ్విన్ తాజాగా క్రికెట్‌కు ఎటువంటి సంబంధం లేని విషయం గురించి మాట్లాడి సంచలనం సృష్టించాడు.
This is becoming a regular menace @IndiGo6E ,my recent experience with them through a third party booking platform was terrible, they make you pay and then end up doing whatever they choose to do.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 26, 2024
Not sure if it’s a scam !!
heyyy who is ever going to pull them up ???
All we… https://t.co/cMTf4fFvKh
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మీద అశ్విన్ తీవ్ర విమర్శలు చేశాడు.ప్రయాణికులతో ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండిగో టికెట్ వ్యవస్థ సరిగ్గా లేదంటూ ఫైర్ అయ్యాడు.ఇండిగో ఫ్లైట్ టికెట్స్ విషయంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని అశ్విన్ తెలిపాడు. థర్డ్ పార్టీ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో సమస్యలు వస్తున్నాయని అశ్విన్ అన్నాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఈ సమస్య కామన్ అయిపోయిందన్నాడు. ప్రయాణికుల బాధను ఇండిగో సంస్థ పట్టించుకోవడం లేదని దుయ్యపట్టాడు.

కస్టమర్లతో తొలుత పేమెంట్ చేయించి.. ఆ తర్వాత వాళ్లకు నచ్చిన సీటింగ్‌ను మనకు కేటాయిస్తారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మనం ఏది సెలెక్ట్ చేసినా వాళ్లు పట్టించుకోరని.. వాళ్లు ఇచ్చింది మనం తీసుకోవాల్సిందేనని , బహుశ ఇది కూడా ఓ స్కామే కావొచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కోరుకున్న సీట్లను మాత్రం ప్యాసింజర్లకు ఇవ్వరని.. అందుకే మీ టైమ్, ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దంటూ అశ్విన్ ఓ పోస్ట్ పెట్టాడు .గతంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అశ్విన్ తెలిపాడు. అయితే ఈ కాంట్రవర్సీ మీద ఇండిగో ఇంకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications