RCB టాప్ లో నిలిచినా, ప్లే ఆఫ్స్ డౌటే - మారుతున్న లెక్కలు.. ఈ టీంలకే ఛాన్స్..!!
RCB IPL 2026: ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరుకున్నాయి. పాయింట్ల పట్టికలో రోజు రోజుకీ లెక్కలు మారుతున్నాయి. తాజాగా కేకేఆర్ పై విజయ్ తో ఆర్సీబీ టాప్ కు చేరింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన కోల్‌కతా.. ఈ ఓటమితో టోర్నీలో వెనక్కు వెళ్లిపోయింది. ఇక.. తాజా లెక్క లతో ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లు ఏవనేది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారుతోంది.
ఆర్సీబీ తాజా విజయం తో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచింది. అయితే, ప్లే ఆఫ్స్ ఖాయం అని చెప్పే పరిస్థితి లేదు. వెనుక ఉన్న టీంలకు ఉన్న పాయింట్లు.. ఆడాల్సిన మ్యాచులు.. వాటి ఫలితాలు ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న స్థానాలు అదే విధంగా నిలబెట్టుకుంటే రెండు టీంలు ప్లే ఆఫ్స్ చేరినట్లు కనిపిస్తోంది. ఆర్సీబీ, గుజరాత్ ప్రస్తుతం తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అధికారికంగా ఈ జట్ల పేర్లు ప్లేఆఫ్ జాబితాలో ఇంకా ప్రకటించక పోయినా, సాంకేతికంగా.. ఇతర టీంలు వీటిని అధిగమించకపోతే ఈ రెండు జట్లు తదుపరి దశకు చేరినట్లే లెక్క. దీంతో.. ఇప్పుడు అసలైన యుద్ధం మూడు, నాలుగు స్థానాల కోసం జరుగుతోంది. ఈ రెండు ఖాళీ సీట్ల కోసం ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

మారుతున్న లెక్కలు... ఫ్లే ఆఫ్స్ ఛాన్స్
మ్యాచులు చివరి దశకు చేరాయి. ప్లే ఆఫ్స్ రేసు కోసం పోటీ పడుతున్న సన్ రైజర్స్, పంజాబ్, సీఎస్కే, రాజస్థాన్ ఇప్పటి వరకు మంచి ఆటను ప్రదర్శించాయి. ఇక, ప్రతీ మ్యాచ్ వారికి చావో రేవో అన్నట్లుగా మారుతోంది. దీంతో.. సోషల్ మీడియాలో కూడా ఏ జట్టు ప్లే ఆఫ్ చేరుతుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచింది. వారు తమ తదుపరి మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ లేదా ఆర్సీబీపై ఒక్క విజయం సాధించినా ప్లే ఆఫ్ టికెట్ లభిస్తుంది. నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, సిఎస్కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు చాలా తీవ్రంగా ఉంది. ఈ మూడు జట్లు తర్వాతి దశకు వెళ్లాలంటే కనీసం రెండేసి విజయాలు సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ రేసులో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతానికి కాస్త ముందంజలో ఉందని చెప్పవచ్చు. పంజాబ్ ఖాతాలో 13 పాయింట్లు ఉండగా, మిగిలిన రెండు జట్లకు 12 పాయింట్లే ఉన్నాయి. దీంతో.. ప్రతీ మ్యాచ్ పట్టికను తలకిందులు చేస్తున్నాయి. ఈ ఉత్కంఠభరితమైన పోరులో క్వాలిఫై అయ్యే జట్ల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications