RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!
ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా విక్రయించబడటం క్రీడా, వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్సీబీని కొనుగోలు చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ మెదడులో ఒకటే ప్రశ్న మెదులుతోంది. సాధారణంగా ఐపీఎల్‌లో యాజమాన్యం మారినప్పుడు లేదా బ్రాండ్ రీబ్రాండింగ్ అవసరమైన్పుడు తమ జట్ల పేర్లను మార్చుకోవడం చూస్తుంటాం. ఈ క్రమంలో ఆర్సీబీ పేరు కూడా మారుతుందేమోనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
అనన్య బిర్లా క్లారిటీ
ఈ నేపథ్యంలో ఊహాగానాలకు ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కీలకంగా ఉన్న అనన్య బిర్లా స్వయంగా తెరదించారు. జట్టు పేరు మార్పుపై వస్తున్న వార్తలకు అనన్య బిర్లా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరోక్షంగా సమాధానమిచ్చారు. ఆర్సీబీ పేరు మారబోదని స్పష్టం చేసే ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను అనన్య బిర్లా తన స్టోరీలో షేర్ చేశారు. ఆర్సీబీ అనేది కేవలం ఓ జట్టు పేరు మాత్రమే కాదు.. అదొక ఎమోషన్ అని.. ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడం కొత్త యజమానులకు ఇష్టం లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. దీంతో 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)' అనే ఐకానిక్ పేరు అలాగే కొనసాగుతుందని స్పష్టమైంది.

బిర్లా గ్రూప్ కన్సార్టియంలోని భాగస్వాములు
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి ఆర్సీబీని కొనుగోలు చేసి ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక్కటే కాదు.. మరికొన్ని అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు కూడా ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ బ్లాక్‌స్టోన్, అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్‌కు చెందిన బోల్ట్ వెంచర్స్ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఒప్పందం కేవలం ఐపీఎల్ జట్టుకే పరిమితం కాకుండా మహిళల ప్రీమియర్ లీగ్‌లోని ఆర్సీబీ మహిళా జట్టు హక్కులను కూడా కవర్ చేస్తోంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టిన ఈ సంస్థలు ఆర్సీబీ బ్రాండ్ వాల్యూను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఫ్యాన్స్ ఖుష్.. సరికొత్త ఆశలు
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఈ జట్టుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం ఆ జట్టు వాల్యూను అమాంతం పెంచేసింది. ఇప్పుడు కొత్త యాజమాన్యం రావడంతో జట్టులో మార్పులు ఉంటాయని భయపడిన ఫ్యాన్స్‌కు జట్టు పేరు మారదని తెలియడం పెద్ద ఊరటనిచ్చింది. పేరు మారకపోయినా కొత్త యజమానుల కింద మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన వ్యూహాలతో ఆర్సీబీ వరుసగా ట్రోఫీలు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ఆర్సీబీ అనే పేరు ఫ్యాన్స్ గుండెల్లో అలాగే ఉండబోతోంది. బిర్లా గ్రూప్ రాకతో జట్టు ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది.
-
ఆర్సీబీకి ఉత్తి పుణ్యానికి రూ. 16,706 కోట్లు -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇంగ్లండ్ స్టార్ సడన్ గుడ్ బై-నిషేధం తప్పదా ? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications