టీమ్ ఇండియాలోకి స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ - కీలక మ్యాచ్ వేళ అనూహ్య మార్పులు..!!
T20 World Cup Ind Vs Zim: టీమిండియా సెమీస్ చేరుతుందా. ఇప్పుడు ప్రతీ క్రికెట్ ఫ్యాన్ లో ఉన్న సందేహం ఇదే. సూపర్ -8 ప్రారంభం తరువాత సెమీస్ లెక్కలు వేగంగా మారి పోతున్నాయి. దక్షిణాఫ్రికాతో భారత్ ఓటమి తరువాత టీమిండియా సెమీస్ చేరటం పైన కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇక జింబాబ్వే, వెస్టిండీస్ తో జరిగే రెండు మ్యాచుల్లో గెలవటం తో పాటుగా నెట్ రన్ రేటు కీలకంగా మారుతోంది. ఈ సమయంలో జింబాబ్వే మ్యాచ్ కోసం జట్టులో కీలక మార్పులు ఖాయమయ్యాయి.
జింబాబ్వేతో మ్యాచ్ వేళ టీం తుది కూర్పు లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. అభిషేక్, తిలక్ లో ఒకరిని తప్పించి సంజూ శాంసన్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన జరిగింది. సౌతాఫ్రికాతో తిలక్ నిర్లక్ష్యపు షాట్ తో అవుట్ అవ్వటం... అభిషేక్ బ్యాటింగ్ తీరులో మార్పు కనిపించకపోవటం తో జట్టు ఈ దిశగా ఆలోచన చేసింది. అయితే, ఈ ఇద్దరూ తొలి పవర్ ప్లే లో ఎంత కీలమైన ఆట గాళ్లో విస్మరించలేమనే చర్చ ఉంది. దీంతో.. జింబాబ్వేతో ఆట సమయంలో బ్యాటర్లలో మార్పు చేయాల్సి వస్తే.. తిలక్ స్థానంలో సంజూను తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిరిగి అక్షర్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది. అర్షదీప్ ను కొనసాగించటమా.. ఆ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకురావటమా అనేది చర్చ జరుగుతోంది. చెన్నై లో కొత్తగా తయారు చేసిన పిచ్ పైన మ్యాచ్ జరగనుండటంతో.. టాస్ సైతం కీలకంగా మారుతోంది.

తుది జట్టులో కీలక మార్పులు
ఇక, జింబాబ్వే మ్యాచ్ కు సెన్సేషనల్ బ్యాటర్ రింకు సింగ్ మళ్లీ టీమ్ఇండియా జట్టుతో చేరను న్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల మంగళవారం జట్టును వీడిన రింకు బుధవారం సాయంత్రానికి భారత్ శిబిరంలో చేరనున్నట్లు బ్యాటింగ్ కోచ్ షితాన్షు కోటక్ వెల్లడించాడు. కాగా, తన తండ్రి కంచన్చంద్ సింగ్ రీసెంట్గా అనారోగ్యానికి గురవ్వడంతో మంగళవారం రింకు సింగ్ జట్టును వీడాడు. ఆయనను గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో రింకు అత్యవరస పరిస్థితుల్లో వరల్డ్ కప్ నుంచి మధ్యలోనే వెళ్లాల్సి వచ్చింది. అయితే రింకు స్థానంలో కుల్దీప్ ను ఆలోచన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. కాగా.. సూపర్ 8లో తదుపరి మ్యాచ్లో రింకు బరిలో దిగే ఛాన్స్ ఉంది. కాగా, గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్కు చేరాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్లో నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. జింబాబ్వే మ్యాచ్ తరువాత భారత్ కు సెమీస్ అవకాశాల పైన దాదాపు స్పష్టత రానుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications