మూడేళ్లుగా తిరుగుతున్నా.. హెల్ప్ చేయండి: సీఎంకు అర్ధరాత్రి రిక్వెస్ట్ పెట్టిన టీమిండియా స్టార్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తెరమీదికి వచ్చాడు. తన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ప్రాపర్టీని కొనుగోలు చేసే విషయంలో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటోన్నాడు. స్థలాన్ని కొనుగోలు చేయడానికి మూడు సంవత్సరాలుగా పాట్లు పడుతున్నాడు. అక్కడున్న నిబంధనలు ప్రతికూలంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చేసేదేమీ లేక ఏకంగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోక్యాన్ని కోరాడు.
ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాన్ని కొనుగోలు చేసే విషయంలో సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అర్ధరాత్రి ఓ పోస్ట్ పెట్టాడు రిషభ్ పంత్. దీన్ని పుష్కర్ సింగ్ ధామికి ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు పంత్. టీమిండియా తరఫున రరెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం వామప్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ.. ఉత్తరాఖండ్ లో స్థలం కొనుగోలు కోసం అర్ధరాత్రి సీఎంకు రిక్వెస్ట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మూడేళ్లుగా స్థలం కోసం వెదుకుతున్నప్పటికీ.. తన అవసరాలకు తగినట్లుగా దొరకట్లేదని ఈ సందర్భంగా రిషభ్ పంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ నుంచి తన నివాసాన్ని సొంత రాష్ట్రానికి మార్చుకోవాలనే కల సాకారం కావట్లేదని వాపోయాడు. సొంత రాష్ట్ర ప్రజల మధ్య నివసిస్తూ.. అక్కడి ప్రగతికి తనవంతు కృషి చేయాలని కోరుకుంటోన్నానని వివరించాడు. ఈ భూమిని తానేమీ ఉచితంగా ఆశించట్లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే స్థలాన్ని కొనుగోలు చేస్తాననీ అన్నాడు.
రిషబ్ పంత్ స్వస్థలం.. హరిద్వార్ జిల్లా రూర్కీ. క్రికెట్ కోసం చిన్నప్పుడే ఢిల్లీకి మకాం మార్చాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యాన్ని వహించాడు. క్రికెట్ లో స్టార్‌గా ఎదిగినప్పటికీ.. తన సొంత రాష్ట్రంలో స్థలాన్ని కొనుగోలు చేసే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటోన్నాడు. సొంత గడ్డపైనే మొదటి ఇల్లు నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆ రాష్ట్రంలోనే అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లించిన వ్యక్తిగా రిషబ్ పంత్ టాప్ లో ఉన్నాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాడు. వరుసగా రెండో ఏడాది కూడా ఆయన ఆ రాష్ట్రంలో హయ్యెస్ట్ టాక్స్ పేయర్‌గా నిలిచాడు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈసారి ఆయన చెల్లించిన పన్ను రెట్టింపు అయింది.
A gift would be lovey for representation out states at the highest level internationally stages but if you allow me I wanna buy it fromGovernment and on there rates at least I can have my first house built in my own state and our state please be helpful. Seriously didn’t know…
— Rishabh Pant (@RishabhPant17) August 7, 2026




Click it and Unblock the Notifications