టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్ట్ నుంచి స్టార్ ఆటగాడు అవుట్
భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టెస్ట్ మ్యాచులను ఆడుతోంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో భారత జట్టు ఘన విజయం సాధించగా, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మూడో టెస్ట్ గబ్బా వేదికగా జరుగనుంది. అయితే మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది.
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గాయపడ్డాడు. జట్టు ప్రాక్టిస్ చేస్తోన్న సమయంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయినట్టు తెలుస్తోంది. బంతి వేగంగా తగలడంతో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.గాయంతో విలవిలాడిన పంత్ ప్రాక్టిస్ మధ్యలోనే ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. పంత్ గాయం తీవ్రతపై ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు. అయితే, పంత్ గాయం తీవ్రంగా తీవ్రంగా ఉంటే కనుక గబ్బా టెస్టుకు అతను దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం కనిపిస్తోంది.గబ్బా గ్రౌండ్‌లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో అక్కడ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన పంత్ జట్టుకు విజయాన్నిందించాడు. గబ్బాలో అప్పటి వరకు ఓడిపోలేదన్న ఆస్ట్రేలియా అహంకారానికి పంత్ గతంలో ముగింపు పలికాడు. అలాంటి పంత్ ఇప్పుడు గాయంతో మూడో టెస్ట్‌కు దూరం అయితే జట్టు గెలవడం కష్టమే అని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థుతుల్లో పంత్ ఆడుతాడో లేదో చూడాలి. డిసెంబర్ 14 నుంచి మూడో టెస్ట్ మొదలుకానుంది.












Click it and Unblock the Notifications