సెమీ ఫైనల్ కు రోహిత్ టీంలో అనూహ్య మార్పులు..!!

Ind Vs Aus Semi final Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ కు రెండు జట్లు సమాయత్తం అవుతున్నాయి. రోహిత్ టీం ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమి ప్రతీకారం ఆసీస్ పై తీర్చుకునేందుకు సై అంటోంది. అంతు చిక్కని దుబాయ్ పిచ్ కండీషన్ల పైన తుది టీం ఎంపికలో రోహిత్ - గంభీర్ కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. న్యూజీలాండ్ పైన నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీం ఇండియా..సెమీ ఫైనల్ కు జట్టులో కీలక మార్పులకు సిద్దమైంది. డాషింగ్ ప్లేయర్ తుది జట్టులో ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు.

రోహిత్ - గంభీర్ కొత్త ప్లాన్
దుబాయ్ వేదికగా భారత్ - ఆసీస్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్ ఈ రోజు జరగ నుంది. చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజీలాండ్ పైన నెగ్గిన రోహిత్ టీం జోరు మీద ఉంది. అనూహ్యం గా తొలి సారి ఏకంగా నలుగురు స్పిన్నర్లతో న్యూజీలాండ్ పైన చేసిన ప్రయోగం ఫలించింది. ఇక, ఇప్పుడు ఆసీస్ తో జరిగే సెమీస్ కోసం కొత్త ప్లాన్లు సిద్దం చేస్తున్నారు. పిచ్ కండీషన్లు దుబాయ్ లో భిన్నంగా ఉండటంతో రోహిత్ - గంభీర్ తుది జట్టు కూర్పులో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఆసీస్ లో హెడ్ లక్ష్యంగా కొత్త ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఆసీస్ బ్యాటర్లను నియం త్రించాలంటే స్పిన్నర్లతో పాటుగా ఇద్దరు పేసర్లు అవసరమని భావిస్తున్నారు.

Rohit - Gautam new plans in final team for Semi final against Australia In Dubai

ఛాన్స్ దక్కేదెవరికి
న్యూజీలాండ్ తో మ్యాచ్ లో వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్‌లో కూడా నలుగురు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆశ క్తి కరంగా మారింది. ఆస్ట్రేలియా జట్టులో మాత్రం ఆడం జంపా ఒక్కడే స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఉన్నాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ట్రావిస్‌ హెడ్‌ పార్ట్‌టైమర్లుగా సేవలందించనున్నారు. భారత్‌పై దూకు డుగా ఆడే ట్రావిస్ హెడ్ ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు. ఫామ్‌ లేక ఇబ్బంది పడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్‌ ఝళి పించడం మొదలుపెట్టాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫామ్‌తో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో నైనా పరుగులు రాబట్టగలిగే క్లాస్ బ్యాటర్.

జట్టులో మార్పులు
ఇటు భారత్ బ్యాటింగ్ టీంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, శుభమన్‌ గిల్‌, కేఎల్ రాహుల్‌, హర్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజాతో బలంగా కనిపిస్తోంది. ట్రావిస్‌ హెడ్, స్టీవ్‌ స్మిత్‌ను కట్టడి చేయడంపైనే భారత బౌలర్లకు అసలైన సవాల్ గా మారుతోంది. ఇక.. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ను కొనసాగిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారుతోంది. వికెట్ కీపర్ గా న్యూజీలాండ్ మ్యాచ్ లో క్యాచ్ ల డ్రాప్ తో ఈ ఆలోచన మొదలైంది. బ్యాటింగ్ లోనూ రాహుల్ సక్సెస్ కావటం లేదు. దీంతో, పంత్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వటం పైన నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. వాతావరణం.. పిచ్ కండీషన్లకు అనుగుణంగా రోహిత్ తన తుది టీంను ఖరారు చేయనున్నారు. దీంతో.. ఈ మ్యాచ్ పైన టీం ఇండియా ఫ్యాన్స్ లో మాత్రం భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+