ఆ వరుస నిర్ణయాలతో భారీ షాక్, తట్టుకోలేకపోయిన క్రికెట్ ఫ్యాన్స్..!!
ఒకరు కాదు. ఇద్దరు కాదు. వరుసగా ఆరాధించిన వారు తాము ప్రేమించే ఆటకు దూరం అవుతుంటే అభిమానులు తట్టుకోలేక పోయారు. ఫలితంతో సంబంధం లేకుండా తమ క్రికెట్ హీరోల ఆట కోసం తపించే వారి గుండె బరువెక్కింది. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఆ క్రికెటర్లు తమ కెరీర్‌కు ముగింపు పలికారు. క్రికెట్‌లో టీమ్ఇండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇంకా.. ఎందరో ఈ జాబితాలో ఉన్నారు. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆ దిగ్గజాల రిటైర్మెంట్ ఒక సారి గుర్తు చేసుకుంటే...
భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఓ లెజెండ్. సమకాలిన ప్రపంచ క్రికెట్‌లో అతడు రారాజు. అలాంటి దిగ్గజ ఆటగాడు 2025 మే 12న టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వయసులో కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 14 ఏళ్ల టెస్టు కెరీర్‌లో కోహ్లీ 123 మ్యాచ్‌లు ఆడి, 9,230 పరుగులు (సగటు 46.85) సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ. 2024లో టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరమే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అదే విధంగా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే రోహిత్ శర్మ 2025 మే నెలలో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు రోహిత్, విరాట్ కంటే ఐదు రోజుల ముందే (మే 07న) గుడ్ బై చెప్పేశాడు. 2013లో టెస్టు అరంగేట్రం చేసిన రోహిత్, 67 మ్యాచ్‌లలో 4,301 పరుగులు సాధించాడు. అతని టెస్టు కెరీర్‌లో 12 శతకాలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై చేసిన 212 పరుగులు అతని టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. కెప్టెన్‌గా 24 టెస్టుల్లో భారత్‌ను నడిపిన రోహిత్, 12 విజయాలు అందించి తనదైన ముద్ర వేశాడు. అలాగే, 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ సైతం ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కోహ్లీతో పాటు రోహిత్ కూడా వన్డేల్లో కొనసాగుతున్నాడు. 2027లో వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా రోహిత్-కోహ్లీ వన్డేలపై ఫోకస్ పెట్టారు. కాగా, వీరి జాబితాలోనే మరి కొందరు ప్రముఖ క్రికెటర్లు ఉన్నారు.
రెండో రాహుల్ ద్రవిడ్‌గా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా ఆగస్టు 24న అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన గూగ్లీలతో మేటి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన అమిత్ మిశ్రా సెప్టెంబర్ 4న ఆటకు వీడ్కోలు పలికారు. భారత్ అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరైన వృద్ధిమాన్ సాహా ఫిబ్రవరి 1న రిటైర్మెంట్ ప్రకటించారు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదిలే సాహా, స్టంపింగ్స్ చేయడంలో దిట్ట. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో సభ్యుడైన పీయూష్ చావ్లా జూన్ నెలలో రిటైర్ అయ్యారు. 300 పైగా టెస్ట్ వికెట్లు తీసిన టీమిండియా పొడగరి పేసర్ ఇషాంత్ శర్మ, డిసెంబర్ నెలలో టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు.2015 ప్రపంచకప్‌లో భారత్ తరపున మెరిసిన మోహిత్ శర్మ డిసెంబర్ 3న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలా.. మరెందరో తమ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినా.. క్రికెట్ ఉన్నంత వరకూ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచిపోయారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications