మీ కన్నీరు చూడలేం - చలించిన సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ : ఎప్పటికీ మీ వెంటే..!!
ప్రపంచ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడింది. కానీ, ప్రపంచ కప్ ఆరంభం నుంచి తమ ఆటతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు. ఫైనల్స్ లో ఓటమి తరువా కోట్లాది మంది హీరోలుగా భావించే రోహిత్, కోహ్లీ, సిరాజ్ కన్నీరు పెట్టుకున్నారు. మ్యాచ్ ఓడిన భారం కంటే వారి కంట కన్నీటితో అభిమానులు చలించిపోయారు. ఆటగాళ్లను చూసిన ప్రేక్షకులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. గెలిచినా..ఓడినా ఎప్పటికీ మేమంతా మీతోనే అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.
రోహిత్ - కోహ్లీ కన్నీటితో:ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్స్‌లో చతికిలపడింది. బహుశా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సిరాజ్ తో సహా కొంతమంది జట్టు ఆటగాళ్లకు ఇది చివరి వన్డే ప్రపంచ కప్. సొంత మైదానంలో వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కలలు కల్లలయ్యాయి. దీంతో టీమిండియా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ వరకు అజేయంగా జట్టును నడిపించిన రోహిత్ కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానాన్ని వీడడం అభిమానులను కలచివేసింది. రోహిత్ పాటు కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలో కన్నీరుమున్నీరయ్యారు. మైదానంలో మన ఆటగాళ్లను చూసిన ప్రేక్షకులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఆటగాళ్లతో పాటు అభిమానులు బోరున విలపించిన దృశ్యాలు స్క్రీన్ పై కనిపించడంతో మైదానమంతా ఉద్వేగమైన వాతావరణం కనిపించింది.

చలించిన ఫ్యాన్స్:సిరాజ్, రాహుల్ తీవ్ర భావోద్వేగానికి గురవ్వడంతో సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అయితే కంట్రోల్ కాకపోవడంతో విరాట్, రోహిత్ శర్మ కూడా ఏడ్చేశారు. టీమిండియా ప్లేయర్లు కన్నీటి పర్యంతం అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అస్సలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. 'ఇలా చూడలేం దయచేసి ఏడవకండి' అని ట్విట్టర్ వేదికగా కొందరు రోహిత్‌ను ఓదారుస్తున్నారు.
'అంతా విధి రాత ఏం చేయగలవు రోహిత్.. విరాట్.. కూల్ కూల్' అని చెబుతున్నారు. మరికొందరైతే గెలుపైనా.. 'ఓటమైనా మీది మాత్రమే కాదు మీ వెనకున్న 140 కోట్ల మందిది.. గెలిస్తే అభినందిస్తాం.. ఓడితే భుజం తట్టి ప్రోత్సహిస్తాం.. ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మీ వెంటే ఉంటాం' అని టీమిండియా వీరాభిమానులు ధైర్యం చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ తో సహా సినీ ప్రముఖులు సైతం టీం ఇండియా కు అండగా నిలిచారు. మద్దతు ప్రకటించారు.
Nothing is more painful than watching tears in Rohit Sharma eyes again after 2019 CWC!
— Saurabh Singh (@100rabhsingh781) November 19, 2023
#INDvsAUS #RohitSharma #INDvsAUSFinal pic.twitter.com/shA95pQG46
మే వెంట మేమున్నామంటూ:ప్రధాని మోదీ టీమిండియా పోరాట పటిమను ప్రశంసించారు. ఏపీ సీఎం జగన్ టీమిండియా ఆట తీరును అభినందించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అనూహ్యంగా టీమిండియాకు మద్దతు కనిపిస్తోంది. హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి స్పందించారు.
ఈ రోజు మనది కాదు. కానీ, టీమిండియా ప్రపంచ కప్ లో ఆడిన తీరు మా మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసారు. రోహిత్, కోహ్లీ కన్నీరు పెట్టటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. టీం ఇండియాకు పూర్తి మద్దతు ప్రకటించారు. హారో నానితో సహా పలువురు సినీ ప్రముఖులు..క్రికెట్ ఫ్యాన్స్ ఇండియన్ టీం కు మద్దతుగా నిలుస్తూ...ఓడినా - గెలిచినా మీ వెంట మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications