Rohit Sharma: అప్పుడే రిటైర్ అయిపోదామనుకున్నా..! రోహిత్ శర్మ షాకింగ్..!
భారత క్రికెట్ దేశానికి అందించిన మేటి క్రికెటర్లలో ఒకడైన స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ (rohit sharma) గత కొంతకాలంగా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంంటున్నాడు. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేసిన రోహిత్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించడంతో ఇక ఈ అవమానాలు పడలేక రోహిత్ రిటైర్ అయిపోతాడనే అంతా భావించారు. కానీ రోహిత్ ఆలోచన వేరేలా ఉంది. అందుకే ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు.
అయితే ప్రస్తుతం వన్డే జట్టులో స్ధానం నిలబెట్టుకోవడానికి కూడా అపసోపాలు పడుతున్న రోహిత్ శర్మ ఏ క్షణమైన రిటైర్మెంట్ ప్రకటించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతీ వన్డే సిరీస్ లోనూ జట్టులో చోటు కాపాడుకోవాలంటే ఆడక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. మరోవైపు జట్టులో స్ధానం కావాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడి నిరూపించుకోవాలని బీసీసీఐ ఓవైపు ఉరుముతోంది. దీంతో దేశవాళీ క్రికెట్ ఆడి యువకులతో పోటీ పడలేక, అలాగని జాతీయ జట్టులో చోటు నిలబెట్టుకోలేకపోతున్న రోహిత్ రిటైర్మెంట్ పై చర్చ మరింత పెరుగుతోంది.

ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తాను గతంలోనే రిటైర్ అయిపోదామనుకున్న ఓ సందర్భాన్ని ఈ హిట్ మ్యాన్ గుర్తుచేసుకున్నాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత, తాను పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యానని, క్రికెట్ తన నుంచి ప్రతిదీ లాగేసుకుందని, కాబట్టి తాను ఇకపై ఆడకూడదని, తన దగ్గర ఏమీ మిగిలి లేదని భావించానని రోహిత్ మాస్టర్స్ యూనియన్ ఈవెంట్ సందర్భంగా వెల్లడించాడు. అయితే దీనికి కొంత సమయం పట్టిందని, ఇది తాను నిజంగా ఇష్టపడే విషయమని తెలిపాడు. తన ముందు రిటైర్మెంట్ ఉందని గుర్తుచేసుకుంటూనే ఉన్నానని, అయితే క్రమంగా తిరిగి ఆటలో లీనమైనట్లు తెలిపాడు.
ఆ వరల్డ్ కప్ ఓటమితో జట్టులో ప్రతి ఒక్కరూ చాలా నిరాశ చెందారని, ఏం జరిగిందో తాము నమ్మలేకపోయామని వెల్లడించాడు. అది తనకు చాలా క్లిష్టమైన సమయమని, ఆ ప్రపంచ కప్‌లో రెండు లేదా మూడు నెలల ముందు కాదు, 2022లో తాను కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రతిదీ దానిపైనే పెట్టానని గుర్తుచేసుకున్నాడు. తన ఏకైక లక్ష్యం ప్రపంచ కప్ గెలవడమని, అది T20 ప్రపంచ కప్ అయినా లేదా 2023 ప్రపంచ కప్ అయినా. కాబట్టి అది జరగనప్పుడు, తాను పూర్తిగా కుంగిపోయానన్నాడు. తన శరీరంలో శక్తి మిగిలి లేదని, కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందన్నాడు.












Click it and Unblock the Notifications