మనల్ని ఎవడ్రా ఆపేది..ఫైనల్‌కు చేరిన RCB..!
ఐపీఎల్-18 సీజన్‌లో ఆర్సీబీ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో పంజాబ్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా ఈ ఏడాది ఫైనల్‌కు చేరిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోయారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్లకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఏ ఒక్క పంజాబ్ బ్యాట్స్‌మెన్ కూాడా క్రీజులో నిలవలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ, హేజిల్ వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టగా. యశ్ దయాల్ 2 వికెట్లు తీశాడు.
102పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 12 పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే మరోవైపు ఫిల్ సాల్ట్ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. ఈ క్రమంలోనే ఫిల్ సాల్ట్ తన అజేయ అర్థ సెంచరీని(56) పూర్తి చేసుకున్నాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

దీంతో 10 ఓవర్లలోనే ఆర్సీబీ లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ పంజాబ్ జట్టుకు మరో అవకాశం ఉంది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుపై పంజాబ్ తన తర్వాత మ్యాచ్ ఆడనుంది. ఇక్కడ విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరి ఆర్సీబీతో తలపడనుంది. ఆర్సీబీ ఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి. ఈ నాలుగుసార్లు కూడా ఆర్సీబీకి నిరాశే ఎదురైంది. మరి ఈ ఏడాది అయినా ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications