శ్రేయస్ అయ్యర్ కు IPL కౌన్సిల్ భారీ షాక్..!!
IPL పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో బోణీ కొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ జట్టుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ముల్లాన్‌పుర్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. కాగా, ఈ సీజన్ లో జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్.. తొలి ప్లేయర్ గా శ్రేయస్ నిలిచారు.
ముల్లాన్‌పుర్ న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్ రేట్ కొనసాగించింది. అయితే దీన్ని తొలి తప్పిదంగా భావిస్తూ, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2ను ఉల్లంఘించినందుకు పంజాబ్ కెప్టెన్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది" అని ఐపీఎల్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగతంగా చూస్తే శ్రేయస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ పెద్దగా కలిసిరాలేదు. తొలుత ఫీల్డింగ్ చేస్తున్న సమంలో చెయ్యి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తన టీమ్ మేట్ కూపర్ కానోలీ కొట్టిన షాట్ నేరుగా అయ్యర్ చేతికి తగలడంతో నొప్పితో విలవిలలాడాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడుతూ కేవలం 11 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

మరో సారి రిపీట్ అయితే కఠిన చర్యలు
అయితే, మ్యాచ్ గెలిచాం కదా అని ఊపిరి పీల్చుకునే లోపే, ఇప్పుడు ఏకంగా 12 లక్షల రూపాయల జరిమానా పడటంతో అయ్యర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. ఈ సీజన్ లో ఓ జట్టు స్లో ఓవర్ రేట్ కొనసాగించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో కొత్త సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇక ఇది తొలి తప్పిదం కావడంతో రూ.12 లక్షల ఫైన్ పడింది. ఒకవేళ ప్రస్తుత సీజన్లోనే ఇది మళ్లీ రిపీటైతే కెప్టెన్‌కు రూ.24 లక్షల జరిమానా విధిస్తారు. అలాగే జట్టులోని ప్లేయర్ల ఫీజులో కూడా కోత పెడతారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు వెల్లడించారు. పంజాబ్ ఈ సీజన్‌లో మరోసారి ఇదే తప్పిదానికి పాల్పడితే.. అప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జరిమానా డబుల్ కావడంతో పాటు జట్టులోకి ఆటగాళ్లు అందరికి కూడా పెనాల్టీ పడుతుంది.












Click it and Unblock the Notifications