IPL 2025: పట్టుబట్టి శ్రేయస్ ను దక్కించుకున్న ప్రీతి జింటా - అసలు కధ..!!
IPL Auction 2025: ఐపీఎల్ లో ఈ సారి ఆక్షన్ తొలి నుంచి ఆసక్తిని పెంచుతోంది. కొత్త రికార్డు లకు చిరునామాగా నిలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ రూ 26.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయటం ఐపీఎల్ చరిత్రలోనే ఒక రికార్డు. అయితే, కాసేపటికే పంత్ ను లక్నో టీం రూ 27 కోట్లతో దక్కించు కోవటం కొత్త చరిత్ర లిఖించింది. ఐపీఎల్ లో పంత్ రేట్ పైన తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయ్యర్ కోసం ఢిల్లీ సైతం చివరి వరకు పోటీ పడింది. ఇప్పుడు పంజాబ్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు బాధ్యతలు అప్పగించనున్నారు.
శ్రేయస్ అయ్యార్ ఈ సారి ఐపీఎల్ లో రెండో అధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ మంచి కెప్టెన్ కోసం అన్వేషిస్తోంది. ఇందుకోసం శ్రేయస్ అయ్యర్, పంత్, కేఎల్ రాహుల్ కోసం తొలి నుంచి స్కెచ్ వేసింది. ఆక్షన్ లో ముందుగా ఈ ముగ్గురిలో ఎవరు దక్కినా సొంతం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందు కోసం అందుబాటులో ఉన్న నిధులతో పక్కా ప్లాన్ తో చేసుకుంది. తొలుత అర్షదీప్ ను దక్కించుకున్న ప్రీతి జింటా టీం.. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో దూకుడుగా వెళ్లింది. అక్కడ తొలుత కోల్ కతా, ఆ తరువాత ఢిల్లీ నుంచి వేలం లో పోటీ కనిపించింది. కానీ, చివరకు పంజాబ్ కే శ్రేయస్ అయ్యర్ దక్కాడు.

పంజాబ్ కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు కోలకత్ టీం కు అయ్యర్ నాయకత్వం వహించాడు. అంతకు ముందు ఢిల్లీకి నాయకత్వ బాధ్యతలు నిర్వహించాడు. కెప్టెన్సీలో అనుభవం ఉన్నవాడు కావటంతో పాటుగా.. బ్యాటర్ గానూ సక్సెస్ ఫుల్ రికార్డు ఉండటంలో ప్రీతి జింటా టీం చివరి వరకు వేలం లో వెంట పడీ మరి దక్కించుకుంది. అదే విధంగా కేఎల్ రాహుల్ కోసం కూడా ఇదే స్థాయిలో వేలం జరిగే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ కోసం కోల్ కతా టీం వేచి చూస్తోంది. ఇక, రిషబ్ పంత్ లక్నో టీం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు రేపు ఈ ఆక్షన్ కొనసాగనుంది.












Click it and Unblock the Notifications