"ప్రయోగాలకు టైం లేదు, ఇక నుంచి..!"- వరల్డ్ కప్ టీమ్ పై తేల్చేసిన గిల్..!
వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే క్రికెట్ వరల్డ్ కప్ (ODI World Cup 2027)పై టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubman Gill ) కీలక వ్యాఖ్యలు చేశాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో గిల్.. వచ్చే వరల్డ్ కప్ లో జట్టు కూర్పుపై ఈ వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ కోసం టీమ్ లో ప్రయోగాలు చేయడానికి ఎక్కువ సమయం లేదని, త్వరగా కుదురుకోవాల్సి ఉందని జట్టులో ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
వెస్టిండీస్ తో తొలి రెండు వన్డేలు ఆడిన జట్టులో పలు మార్పులు చేసి మూడో వన్డేలో బరిలోకి దిగి జట్టు ఓటమి పాలైన నేపథ్యంలో గిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా తర్వాతి సిరీస్ నుండే ప్రపంచ కప్‌లో ఆడబోయే జట్టు కూర్పుతో బరిలోకి దిగాలని గిల్ భావిస్తున్నాడు. డిసెంబర్ 2019 తర్వాత స్వదేశంలో వెస్టిండీస్ చేతిలో భారత్ తన మొదటి వన్డే ఓటమిని చవిచూడటంతో ఇకపై ప్రయోగాల జోలికి వెళ్లకుండా వరల్డ్ కప్ ఆడే జట్టుతోనే బరిలోకి దిగాలని గిల్ ప్లాన్ చేస్తున్నాడు.

విండీస్ తో సిరీస్ గెల్చుకున్నా, మూడో వన్డేలో ఓటమి తర్వాత గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే, ప్రయోగాలు చేయడానికి అంత సమయం లేదన్నాడు. తాము ఆడాలనుకుంటున్న జట్టు కూర్పుతోనే బరిలోకి దిగాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. తదుపరి సిరీస్ నాటికి తమకు కావాల్సిన ఆటగాళ్లందరూ అందుబాటులోకి వస్తారని ఆశిస్తున్నానని గిల్ తెలిపాడు. ప్రపంచ కప్‌లో తాము ఏ కూర్పుతో ఆడాలనుకుంటున్నామో, ఆ కూర్పుతోనే ఆడటం ప్రారంభించాలనుకుంటున్నామని తేల్చిచెప్పేశాడు. వాస్తవానికి విండీస్ తో సిరీస్ జరుగుతున్న సమయంలోనే 2026 ఆసియా క్రీడలు కూడా జరగడంతో, ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కూడా జట్టుకు అందుబాటులో లేడు. వివిధ కారణాల వల్ల ఆటగాళ్లు జట్టుకు దూరమవ్వడం నిరాశ కలిగించే విషయమని గిల్ అభిప్రాయపడ్డాడు. దీంతో రాబోయే సిరీస్ లకు బుమ్రా, హార్దిక్ లను జట్టులోకి తీసుకుని ఆడించేందుకు గిల్ సిద్దమవుతున్నాడు.














Click it and Unblock the Notifications
