Smriti Mandhana: పెళ్లి వాయిదా తర్వాత స్మృతీ మంథాన తొలి పోస్ట్..! ఆ రింగ్ మాయం?
కుటుంబ సభ్యులను ఆరోగ్య సమస్యలు బాధించడంతో స్మృతి మంధాన మరియు పలాష్ ముచ్చల్ వారి వివాహాన్ని వాయిదా వేశారు; వాయిదాకు వైద్య కారణాలేనని అధికారులు ధృవీకరించారు మరియు కొత్త తేదీని నిర్ణయించాల్సి ఉంది.
టీమిండియా మహిళ క్రికెటర్ స్మృతీ మంథాన, తన స్నేహితుడు, సింగర్ పలాష్ ముచ్చల్ తో పెళ్లికి సిద్ధమైన వేళ చివరి నిమిషంలో ట్విస్ట్ లు ఎదురయ్యాయి. సడన్ గా స్మృతి మంథాన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిపాలవ్వడంతో పలాష్ తో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. ఈ ఘటన తర్వాత పలాష్ కూడా ఆస్పత్రిలో చేరాడు. అనంతరం గతంలో తన మాజీ లవర్ తో పలాష్ జరిపిన సంభాషణ అంటూ కొన్ని వాట్సాప్ ఛాట్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం వెనుక ఏదో ఉందనే చర్చ మొదలైంది.
ఈ దశలో పలాష్ ముచ్చల్ సోదరి పలాక్ ముచ్చల్ ఎంటరైంది. తన సోదరుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడటానికి స్మృతీ మంథాన తండ్రి అనారోగ్యమే కారణమని స్పష్టం చేసింది. అలాగే తన సోదరుడు పలాష్ ముచ్చల్ వాట్సాప్ ఛాట్స్ ను కొట్టిపారేసింది. అయినా ఫ్యాన్స్ లో అనుమానాలు మాత్రం కొనసాగాయి. ఈ నేపథ్యంలో స్మృతీ మంథాన ఈ వివాదం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

తాజాగా స్మృతీ మంథాన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన వీడియోలో కనిపించింది. దీంతో అభిమానుల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. దీని వెనుక మరో కీలక కారణం ఉంది. ఆ వీడియోలో ఆమె పలాష్ ముచ్చల్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ రింగ్ ఆమె చేతికి కనిపించకపోవడమే. స్మృతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్‌తో 'పెయిడ్ పార్ట్‌నర్‌షిప్' ప్రకటనను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె చేతికి పలాష్ గతంలో తొడిగిన ఉంగరం లేదు. దీంతో ఈ యాడ్ నిశ్చితార్థానికి ముందే తీసిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ప్రకటన వివాహ తేదీకి లేదా నిశ్చితార్థానికి ముందే షూట్ జరిగినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుండి పెళ్లి సంబంధిత పోస్ట్‌లను తొలగించడం ద్వారా వాయిదాపై ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా కేవలం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగానే అని ఇరు కుటుంబాల సభ్యులు క్లారిటీ ఇచ్చారు. పలాష్ తల్లి అమితా మాత్రం వివాహం త్వరలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications