IPL Auction 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.5.15 కోట్లే.. ఎవరిని కొనుగోలు చేస్తారో!

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం 2025 మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. ఆటగాళ్ల కోసం ప్రాంచేజీలు పోటీ పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వేల రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు జరిగింది. సోమవారం కూడా వేలం నిర్వహించనున్నారు. ఆదివారం జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అతర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్ జిత్ సింగ్ ఉన్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ ను రూ.8 కోట్లు, ఇషాన్ కిషన్ రూ.11.25 కోట్లు, రాహుల్ చాహర్ ను రూ.3.2 కోట్లు, ఆడమ్ జంపా రూ.2.4 కోట్లు, అథర్వ తైదే రూ.30 లక్షలు, అభినవ్ మనోహర్ రూ.3.2 కోట్లు, సిమర్ జిత్ సింగ్ ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ ఎక్కువగా చెల్లించింది. రిటైన్ ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసిన ఎస్ఆర్హెచ్ వేలంలో కేవలం రూ.45 కోట్లతో పాల్గొంది.

Sunrisers Hyderabad have Rs 5 15 crores to participate in the second day of IPL Auction 2025

ఈ రోజు ఎస్ఆర్ హెచ్ చిన్ని ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. జట్టు వద్ద కేవలం రూ.5.15 కోట్లే మిగిలి ఉన్నాయి. ఈ రూ.5.15 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మంది స్వదేశీ ఆటగాళ్లు, 4 విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధరను బట్టి తీసుకునే ఆటగాళ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో గరిష్ఠంగా 25 మంది ఉండొచ్చు. కనిష్ఠంగా 21 నుంచి 23 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. ఆదివారం 8 మంది ఆటగాళ్లు, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఐదుగురు.

మొత్తం 13 మంది ఆటగాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉన్నారు. సోమవారం ఎస్ఆర్హెచ్ కనీసం 8 మంది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న వారిలో పాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు), నితీష్ రెడ్డి (రూ. 6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు) ఉన్నారు. ప్రస్తుతానికి జట్టులో పాట్ కమ్మిన్స్ హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక శర్మ, నితిష్ రెడ్డి, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అతర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్ జిత్ సింగ్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+