Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో ప్రత్యక్షమైన టీమిండియా స్టార్ క్రికెటర్

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు ఆరంభం అయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ఈ-డిప్ ద్వారా టికెట్లను పొందిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 ఫార్మట్ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య దేవిష షెట్టితో కలిసి ఈ తెల్లవారు జామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రే సూర్యకుమార్ యాదవ్ దంపతులు తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.

Suryakumar Yadav along with his wife Devisha Shetty offers prayers at Tirumala Temple

ఈ తెల్లవారు జామున స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో అర్చకులు వారికి ఆశీర్వచనాలు పలికారు. తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆలయం బయట పలువురు భక్తులు సూర్యకుమార్ యాదవ్ తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. వారిని నిరాశపర్చకుండా సూర్యకుమార్ యాదవ్ దంపతులు ఫొటోలు దిగారు.

జనవరి 11 నుంచి న్యూజిలాండ్ జట్టు భారత్‌లో మూడు కీలకమైన వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వస్తారని అంచనా. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌నకు ముందు, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు ఈ టీ20 సిరీస్ కీలక సన్నాహకం. ఈ ఫార్మట్ కేప్టెన్ కావడం వల్ల ప్రస్తుతం అందరి చూపూ అతని మీదే ఉంది. పైగా ఫామ్ ను కోల్పోయాడు. వ్యక్తిగతంగా ఈ మధ్యకాలంలో పెద్దగా రాణించట్లేదు.

టీ20 సిరీస్, ప్రపంచకప్‌ జట్లను ఇప్పటికే ప్రకటించారు. వన్డే స్క్వాడ్ జనవరి 3-4 మధ్య విడుదల కావచ్చని సమాచారం. ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన వైస్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో శతకాలతో ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. టీ20 సిరీస్ ప్రతిష్ఠాత్మకం కావడం వల్ల ముందుగానే జట్టును ప్రకటించింది. బీసీసీఐ.

టీ20 ప్రపంచ కప్, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టులో- సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కేప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+