సూపర్ 8లో ఆ మ్యాచ్ లో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్సులు- సూర్యకుమార్ షాకింగ్ స్టేట్మెంట్
నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ లో మలి అంకం మొదలుకాబోతోంది. సూపర్ 8 ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ సాయంత్రం 7 గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించనున్నాయి. పాకిస్తాన్ కు అగ్నిపరీక్షగా మారిందీ సూపర్ 8. భారత్ తో తప్ప గ్రూప్ దశలో మిగిలిన అన్నింట్లోనూ గెలిచింది గానీ అవి చిన్నజట్లే. ఇక్కడ సమవుజ్జీలతో తలపడాల్సి ఉంది.
భారత్.. దక్షిణాఫ్రికాతో..
రేపు.. భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లీగ్స్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8లోకి అడుగు పెట్టాయి ఈ రెండు జట్లు. పైగా- గత టీ20 వరల్డ్ కప్ ఫైనలిస్టులు కూడా. అప్పట్లో టీమిండియా చేతిలో ఓడిపోయింది దక్షిణాఫ్రికా. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.

అభిషేక్‌ను కట్టడి చేయడానికి ప్రణాళికలు..
ఈ పరిస్థితుల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్‌ను కట్టడి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటోన్న జట్ల గురించే తాను ఆందోళన చెందుతున్నానని వ్యాఖ్యానించాడు. అభిషేక్ శర్మ గురించి ఆందోళన చెందుతున్న వారికంటే, అతన్ని ఎదుర్కొనే ప్రత్యర్థి జట్ల గురించే తనకు మరింత చింతగా ఉందని పేర్కొన్నాడు.
తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది..
అతను గత సంవత్సరం అద్భుతంగా రాణించాడని, జట్టుకు ఎంతో చేశాడని, ఇప్పుడు అతనికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. టాస్ ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇప్పుడు టాస్ అనేది ఓవర్ రేటెడ్ అయిందని, మొదటి ఇన్నింగ్స్‌లో చక్కగా బ్యాటింగ్ చేసి మంచి స్కోరు సాధించగలిగితే, మంచు ప్రభావం ఉన్నప్పటికీ, బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించి మ్యాచ్ ను సమర్థవంతంగా కాపాడుకోగలదని ధీమా వ్యక్తం చేశాడు.
గెలుపు అవకాశాలు 50-50..
తిలక్ వర్మకు బ్యాటింగ్ విషయంలో కొన్ని నిర్దుష్ట సూచనలు ఉన్నాయని సూర్యకుమార్ వెల్లడించాడు. ఒక వికెట్ పడితే స్వేచ్ఛగా షాట్లు ఆడవచ్చని, అయితే రెండు వికెట్లు పడితే మాత్రం క్రీజులో కొంత సమయం గడిపి ఆడాలని సూచించారని, అతన అదే అనుసరిస్తున్నాడని తెలిపాడు. తిలక్ ఫామ్ పట్ల ఎటువంటి ఆందోళన లేదని పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్ లో గెలుపు అవకాశాలు 50-50 గా ఉంటాయని అంచనా వేశాడు.
అదనపు ప్రయోజనం ఉండదు..
అహ్మదాబాద్ పిచ్‌పై చాలా మ్యాచ్ లు ఆడిన అనుభవం దక్షిణాఫ్రికాకు ఉందని, అందువల్ల అహ్మదాబాద్‌లో ఆడటం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం కూడా ఉండదని తాను భావిస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం అవసరమని, ఈ నైపుణ్యం తమకు ఉందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ గమనాన్ని మార్చగల ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని ఆయన అన్నారు.
జట్టులో మార్పులుండవ్..
తుదిజట్టులో మార్పులు, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ప్లేయింగ్ 11లో తీసుకోవడం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు సూర్యకుమార్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. "నేను అతన్ని జట్టులోకి తీసుకోవాంటే ఇప్పుడు అభిషేక్‌ను తప్పించాలా? లేదా తిలక్‌నా?" అని చమత్కరించాడు. ప్రస్తుత జట్టు కూర్పు సమతుల్యంగా ఉందని, ఎలాంటి మార్పులు ఉండవని, తిలక్ ను ఓపెనింగ్‌కు పంపే అవకాశం పూర్తిగా మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడుతుందని చెప్పాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications