T20 World Cup 2024: వికెట్ కీపర్ రేసులో ఐదుగురు! ధోనీ వారసుడిని తేల్చనున్న ఐపీఎల్?
ఒకప్పుడు టీమిండియాలో వికెట్ కీపర్, కెప్టెన్ రెండు బాధ్యతల్ని సమర్ధవంతంగా మోసిన మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తో చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. అదే సమయలో కెప్టెన్సీకి నలుగురైదుగురు ఆటగాళ్లు బెస్ట్ ఆప్షన్స్ గా మారారు. అయితే వికెట్ కీపర్ స్ధానానికి మాత్రం పోటీ మామూలుగా లేదు. భారత జట్టులో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఐదుగురు బ్యాట్స్ మెన్ ఇప్పుడు వికెట్ కీపర్ స్దానం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ధోనీ వారసుడయ్యేదెవరన్న దానిపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం టీమిండియాకు టీ20ల్లో వికెట్ కీపర్ స్ధానం కోసం ఐదుగురు బ్యాట్స్ మెన్ పోటీ పడుతున్నారు. వీరిలో ఇషాన్ కిషన్, జితేష్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. వీరిలో గత ఏడాది కాలంలో ఇషాన్ కిషన్ కు 11 అవకాశాలు లభిస్తే సంజూ శాంసన్, జితేష్ శర్మకు తొమ్మిదేసి అవకాశాలు లభించాయి. అయితే వీరిలో జితేష్ శర్మ వైపు టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపింది. దీంతో గత నవంబర్ నుంచి జరిగిన దక్షిణాఫ్రికా, ఆప్ఘనిస్తాన్ సిరీస్ ల్లో జితేష్ కీపర్ స్ధానంలోకి వచ్చాడు.

Recommended Video

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో టాప్ ఆర్డర్ లో వచ్చి రెండు హాఫ్ సెంచరీలు కొట్టిన ఇషాన్ కిషన్ కు టీమ్ లోకి రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ రాకతో చోటు లేకుండా పోయింది. కానీ సంజూ శాంసన్, జితేష్ శర్మ మాత్రం మిడిల్ ఆర్డర్ లో వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్దితి. ఈ ముగ్గురిలో టాప్ ఆర్డర్ లో ఆడే ఇషాన్ కు స్లాట్ కోసం పోటీ పడాల్సిన పరిస్ధితి. సంజూ, జితేష్ లతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ నుంచి కూడా వీరికి గట్టి పోటీ ఉంది. వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉండటంతో ఈ ఐదుగురిలో ఒకరు లేదా ఇద్దరిని ఎంచుకోవాల్సిన పరిస్ధితి ఉంది.
అయితే జూన్ లో అమెరికా, వెస్టిండీస్ ల్లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ టీ20 సిరీస్ లు ఆడటం లేదు. ఇది టీమిండియా వికెట్ కీపర్ సెలక్షన్ కు మైనస్ కానుంది. అయితే మధ్యలో ఐపీఎల్ 2024 రూపంలో టీమిండియా వికెట్ కీపర్ ఎంపికకు సరైన ప్లాట్ ఫామ్ దొరకబోతోంది. ఇందులో సత్తా నిరూపించుకుంటే ఇషాన్ కిషన్, జితేష్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ టీమిండియా వికెట్ కీపర్ గా ఎంపిక కావడం ఖాయం. కాబట్టి వీరి ఆశలన్నీ ఇప్పుడు ఐపీఎల్ పైనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications