టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టేది ఆ జట్టే
T20 World Cup 2024: ఈ సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది.
వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ దీని మీదే ఉంది. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా.. జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో తలపడబోతోన్నాయి.
ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉంటాయి. ఈ నాలుగు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు సూపర్ 8కు క్వాలిఫై అయినట్టు గుర్తిస్తారు. మళ్లీ సూపర్ 8 టీమ్‌లను రెండు గ్రూపులుగా చేస్తారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతాయి. సెమీస్ గెలిచిన రెండు జట్లు ఫైనల్స్‌లో తలపడతాయి.
ఈ దఫా విజేత ఎవరనే అంచనాలు అప్పుడే మొదలయ్యాయి కూడా. అపారమైన అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న మాజీలు తెర మీదికి వస్తోన్నారు. ఒక్కొక్కరు ఒక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచే ఆటగాళ్లపైనా జోస్యం చెబుతోన్నారు.
తాజాగా ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ నాజర్ హుస్సేన్.. తన అంచనాలను వెల్లడించాడు. ఈ సారి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. గత ఏడాది ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్.. అందులో నుంచి గుణపాఠాలను నేర్చుకుందని వ్యాఖ్యానించాడు.
లోపాలన్నింటినీ సరి చేసుకుని కొత్తగా టీ20 వరల్డ్ కప్‌లోకి అడుగుపెడుతుందని నాజర్ హుస్సేన్ చెప్పాడు. ఫైనల్స్ వరకూ వెళ్లగలిగినప్పటికీ.. కప్‌ను సాధించలేదని, రన్నరప్‌గా మాత్రమే సరిపెట్టుకుంటుందని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా ఈ సారి టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తుందని అంచనా వేశాడు.
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడని నాజర్ హుస్సేన్ చెప్పాడు. ప్రస్తుతం టీ20 ఫార్మట్ ఐసీసీ ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్ 1గా ఉన్న సూర్యకుమార్.. టోర్నీ మొత్తానికీ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటాడని వ్యాఖ్యానించాడు.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications