టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సారథి ఎవరో తేల్చేసిన బీసీసీఐ
T20 World Cup 2024: ఈ సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది.
వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ దీని మీదే ఉంది. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఉగాండా, అమెరికా.. జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో తలపడబోతోన్నాయి.
ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉంటాయి. ఈ నాలుగు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన రెండు జట్లు సూపర్ 8కు క్వాలిఫై అయినట్టు గుర్తిస్తారు. మళ్లీ సూపర్ 8 టీమ్‌లను రెండు గ్రూపులుగా చేస్తారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతాయి. సెమీస్ గెలిచిన రెండు జట్లు ఫైనల్స్‌లో తలపడతాయి.
ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టుకు నాయకత్వాన్ని వహించేది ఎవరనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత ఏర్పడింది. గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో- కేప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు పడుతుందంటూ వస్తోన్న వార్తలకు తెరపడింది.
రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడబోతోంది టీమిండియా. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జై షా ధృవీకరించారు. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్టుకు రోహిత్ శర్మ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడని, అతని నాయకత్వంలో జెండా పాతుతామని అన్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కేప్టెన్‌గా ఉంటాడని తెలిపారు.
సుమారు రెండు సంవత్సరాల పాటు టీ20 ఇంటర్నేషనల్స్‌కు దూరంగా ఉన్నాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌లల్లో డకౌట్ అయ్యాడు గానీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఇక అదే ఫార్మట్‌లో సాగే ఐపీఎల్ 2024లో ఆడబోతోన్నాడు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications