టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే టీమ్ ఇదే..!!

T20 World Cup 2024 South Africa squad: ఐపీఎల్ 2024లో ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించబోతోంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 2వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌.. ఇందులో ఉన్నాయి. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.

T20 World Cup 2024 South Africa squad announced

ఇందులో ఆడబోయే దేశాల క్రికెట్ బోర్డులన్నీ కూడా మే 1వ తేదీ నాటికి తమ ప్లేయర్ల వివరాలను ప్రకటించాల్సి ఉంది. గడువులోగా ఈ జాబితాను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో- దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన ప్లేయర్ల వివరాలను వెల్లడించింది. సీనియర్లు, జూనియర్లకు ఇందులో చోటు కల్పించింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ఆడుతున్న పలువురు క్రికెటర్లకు దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో స్థానం లభించడం విశేషం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్.. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే తన దేశ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తాడు. డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, కగిసొ రబడ, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జెన్‌సెన్, ఎన్రిచ్ నోర్ట్జె వంటి సీనియర్లను జట్టులోకి తీసుకుంది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్.

15 మంది ప్లేయర్లల్లో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రీజా హెన్డ్రిక్స్, ర్యాన్ రికెల్టన, ఎయిడెన్ మార్క్‌రమ్ (కేప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జెన్‌సెన్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసొ రబడ, ఎన్రిచ్ నోర్ట్జె, ఒట్నీల్ మార్ట్‌మన్, కేశవ్ మహారాజ్, తబ్రేజ్ శాంసీ, జోర్న్ ఫర్ట్యూన్‌లు ఉన్నారు. నాండ్రె బర్గర్, లుంగి ఎంగిడి ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+